Home » చేతి వేళ్ల‌ను విరిచిన‌ప్పుడు ట‌ప్ అనే సౌండ్ ఎందుకు వ‌స్తుందో తెలుసా?

చేతి వేళ్ల‌ను విరిచిన‌ప్పుడు ట‌ప్ అనే సౌండ్ ఎందుకు వ‌స్తుందో తెలుసా?

by Bunty
Ad

సాధార‌ణంగా మ‌నం మ‌న చేతి వేళ్ల‌ను ఒళ్లు విరుచుకుంటూ స్ట్రెచ్ చేస్తాం. అప్పుడు ట‌ప్ అనే సౌండ్ వ‌స్తుంది. ఒక్క సారి సౌండ్ వ‌చ్చిన వేళికి మ‌రో సారి అలాంటి సౌండ్ రాదు. కొద్ది స‌మ‌యం త‌ర్వాత వేళ్ల‌ను స్ట్రేచ్ చేస్తే అలాగే ట‌ప్ అని సౌండ్ వ‌స్తుంది. మ‌నం ఇలాంటివి ఎక్కువ మార్నింగ్ టైమ్ ల‌లో చేస్తుంటాం. లేదా నిద్ర వ‌చ్చే స‌మ‌యాల్లో కూడా చేస్తాం. అయితే అలా ఎందుకు సౌండ్ వ‌స్తుంది అని ఎప్పుడు అయినా ఆలోచించారా. అయితే ఇప్పుడు చేతి వేళ్ల‌ను అలా విరిచిన‌ప్పుడు అలా ఎందుకు సౌండ్ వ‌స్తుందో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement


చేతి వేళ్లను విరిచిన‌ప్పుడు ట‌ప్ అని సౌండ్ రావ‌డానికి గ‌ల కార‌ణం.. మ‌న శ‌రీరంలో ఎముక‌ల మ‌ధ్య గ్యాస్ ఫామ్ అవుతుంది. ఆ గ్యాస్ ఒక బుడ‌గ‌లుగా ఏర్పాడుతాయి. మ‌నం వేళ్లను స్ట్రేస్ చేసిన‌ప్పుడు బుడ‌గ‌లు పేల‌డం ద్వార ట‌ప్ అనే సౌండ్ వ‌స్తుంది. మ‌నం ఒక్క సారి బుడ‌గ‌ల‌ను పేల్చిన త‌ర్వాత మ‌ళ్లీ ఆ బుడ‌గలు త‌యారు కవ‌డానికి కొంచం స‌మ‌యం ప‌డుతుంది. ఆ స‌మ‌యంలో గ్యాస్ మ‌ళ్లీ ఫామ్ అవుతుంది. మ‌ళ్లీ ఫామ్ అయిన గ్యాస్ తిరిగి బుడగ‌లుగా ఏర్పాడుతాయి.

Advertisement

అప్పుడు వేళ్లను మ‌ళ్లీ స్ట్రేస్ చేసిన‌ప్పుడు ట‌ప్ అనే సౌండ్ మ‌ళ్లి వినిపిస్తుంది. అయితే ఈ గ్యాస్ అనేది ఎలా వ‌స్తుంది అంటే.. శ‌రీరంలో రెండు ఎముకల మధ్య సినోవియల్ ఫ్లూయిడ్ ఉంటుంది. ఈ సినోవియల్ ఫ్లూయిడ్ లుబ్రికంట్ లా పని చేస్తూ ఉంటుంది. చేతులని ముడ‌వ‌టం వంటివి చేసిన స‌మ‌యంలో ఈ ఫ్లూయిడ్ అనేది నైట్రోజ‌న్ గ్యాస్ గా మారుతుంది. ఆ గ్యాసే బుడ‌గ‌లుగా మారుతుంది.

Visitors Are Also Reading