Home » 2008 లోనే రిటైర్ అవుదాం అనుకున్న సెహ్వాగ్ ను అడ్డుకున్న సచిన్..!

2008 లోనే రిటైర్ అవుదాం అనుకున్న సెహ్వాగ్ ను అడ్డుకున్న సచిన్..!

by Azhar
Ad

టీం ఇండియా డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ గురించి కొత్తగా పరిచయ చేయాల్సిన అవసరం లేదు. 1999 లో భారత జట్టు తరపున వన్డే అరఞ్ఞగేట్రం చేసిన సెహ్వాగ్ 2001 లో టెస్ట్ లోకి 2006 లో టీ20 లోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఫార్మటు ఏదైనా సరే సెహ్వాగ్ ఆడే తీరు మాత్రం ఒక్కటే ఉంటుంది. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ గా ఉన్న సెహ్వాగ్ గంగూలీ కెప్టెన్సీలో ఓపెనర్ గా మారాడు. ఆ తర్వాత అసలు వెన్నకి చూడాల్సిన అవసరం సెహ్వాగ్ కు రాలేదు. ఇక అంతర్జాతీయ క్రికెట్ నుండి 2013 లో సెహ్వాగ్ తప్పుకున్నాడు.

Advertisement

కానీ అసలు సెహ్వాగ్ 2008 లోనే తన రిటైర్మెంట్ ప్రకటించాలని అనుకున్నాడట.. కానీ సచిన్ టెండూల్కర్ వల్ల తాను ఆగినట్లు తెలుస్తుంది. అయితే 2008 లో మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీలో భారత జట్టు పర్యటించింది. ఆ పర్యటనలో టెస్టులో రాణించిన సెహ్వాగ్ వన్డేలో మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. వరుసగా 5 మ్యాచ్ లలో ఫెయిల్ అయ్యాడు. దాంతో ధోని సెహ్వాగ్ ను తుది జట్టు నుండి తప్పించాడు. అది తనను ఎంతో బాధించింది. ధోని చేసిన ఆ పనితో వన్డే క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించి కేవలం టెస్టులలో మాత్రమే కొనసాగాలని నిర్ణయించుకున్నాడు.

Advertisement

తాను తీసుకున్న ఈ నిర్ణయాన్ని మొదట సచిన్ కు చెప్పాడు సెహ్వాగ్. దాంతో సచిన్ సెహ్వాగ్ తో ఇది జీవితానికి సంబంధించిన విషయం. కాబట్టి కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకో.. ముందు కొన్ని రోజులు క్రికెట్ నుండి రెస్ట్ తీసుకొని.. ఇంటికి వేళ్ళు. తిరిగి వచ్చిన తర్వాత కూడా నువ్వు రాణించలేకపోతే.. అప్పుడు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో అని సచిన్ సెహ్వాగ్ చెప్పాడు. దాంతో సచిన్ మాట్లా విన్న సెహ్వాగ్ కొన్ని ర్పజులు విశ్రాంతి తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ తన ఫామ్ లోకి వచ్చేసాడు. దాంతో తన రిటైర్మెంట్ ఆలోచన పక్కకు పెట్టాడు సెహ్వాగ్.

ఇవి కూడా చదవండి :

సిరాజ్ ను అవమానించారు.. అంపైర్లు కూడా ఏం మాట్లాడలేదు.. నాకు కోపం వచ్చి..?

నేను ఇలా ఉండటానికి కారణం ఆ జట్టే అంటున్న ధోని..!

Visitors Are Also Reading