హిందూ ధర్మంలో పౌర్ణమికి ఎంత ప్రాధాన్యత ఉందో మనందరికీ తెలుసు. అందులోనూ శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమికి చాలా ప్రాధాన్యత ఉంది. ఆరోజున, స్నాన, దానాలు, తర్పణాలు, సోదరీమణులు తమ సోదరులకు రాఖీ కట్టడాలు చేయాలని చెప్పబడింది. రెండు రోజులు పౌర్ణమి తిధి ఉండడంతో ఏరోజు రాఖి పండుగ జరుపుకోవాలి అన్న సందేహం చాలా మందిలో నెలకొని ఉంది. బుధవారం రాఖి పండుగ చేసుకోవాలా లేక గురువారం చేసుకోవాలా అన్న క్లారిటీ కోసం ఈ ఆర్టికల్ చదవండి. ఈ ఏడాది పౌర్ణమి వచ్చే రోజులలో భద్ర నీడ ఉంది.
అయితే, ఆగస్టు 30న రాత్రి 8:58 వరకు భద్ర నీడ ఉంది. అందుకే రాఖీని ఆగస్టు 31న ఉదయం 7.45 గంటల సమయంలోపు జరుపుకోవాలి. భద్ర నీడ సమయంలో రాఖీ కట్టడం శ్రేయస్కరం కాదు. ఇంకా, రాఖి కట్టే విషయంలో కొన్ని నియమాలను తెలుసుకుని పాటించాలి. రాఖీ కట్టే సమయంలో సోదరుడి ముఖం తూర్పు దిశలోను, సోదరి ముఖం పడమర లేదా ఉత్తరం దిశలోను ఉండాలి. రాఖి కట్టే సమయంలో ఎవరి ముఖానికైనా దక్షిణం ఎదురుగా ఉండకూడదు. అది అశుభమైనదిగా పరిగణించబడుతుంది.
అందుకే ఈ ఏడాది రక్షా బంధన్ ను ఆగస్టు 30, ఆగస్టు 31 తేదీల్లో జరుపుకోవాలి. ఆగస్టు 30న ఉదయం 10.12 గంటల నుంచి ఆగస్టు 31న ఉదయం 7.45 గంటల వరకు ఉంది. ఈసారి రాఖి పండుగ ప్రత్యేక పౌర్ణమిగా చెప్పబడుతోంది. ఈరోజు నిర్దేశించిన సమయంలో మీ సోదరులకు రాఖీని కట్టి వారి క్షేమాన్ని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలపండి.