ముఖ్యంగా తల్లిపాలు ఇచ్చే తల్లుల్లో ఎక్కువ శాతం సమస్యలు ఈ విధంగా ఎదురవుతాయి. మొదటిది, ఎక్కువ శాతం మందికి ఉండే సమస్య చనుమొనలు సరిగ్గా లేకపోవడం, లోపలికి పూడుకు పోయినట్టు ఉన్నా.. బాగా కురచగా లేదా బాగా లావుగా ఉన్నా సమస్యల తలెత్తుతుంటాయి. అదేవిధంగా తల్లికి పాల ఉత్పత్తి సరిగ్గా ఉన్నా బిడ్డ రొమ్ము పట్టడం లేదు అని, సునాయసంగా ప్రత్యామ్నయ మార్గం ఎంచుకుంటారు.
Advertisement
ఇక్కడ మనకు కావాల్సింది అల్లా ఓపిక. కొన్ని సులభమైన టెక్నిక్‌లతో అలాంటి చనుమొనలను బిడ్డ పట్టడానికి అనువుగా సరిచేయొచ్చు. కొందరికి పాలు ఇచ్చేటప్పుడు బిడ్డను సరైన పద్దతిలో పట్టకపోవడం వల్ల, మరీ లాగినట్టు అయి చనుమొనలు చిట్లినట్టు అవుతాయి. మొదటిసారి తల్లి అయిన వారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. దానికోసం తాత్కాలికంగా నిపుల్ షీల్డ్ వాడొచ్చు. అనుభవజ్ఞులైన నర్సులు బ్రెస్ట్ ఫీడింగ్ పొజిషన్స్ నేర్పుతారు. తద్వారా తల్లిబిడ్డలు ఇద్దరికీ కూడా సులువుగా ఉంటుంది. బిడ్డ తక్కువ శ్రమతో తృప్తిగా పాలు తాగితే కనీసం రెండు గంటలు నిద్రపోతారు.
Advertisement
మొదటి రెండు నెలల్లో బిడ్డకు ప్రతీ రెండు గంటలకొకసారి పాలు పట్టాలి. నెలలు నిండే కొద్దీ పాలు ఇచ్చే నిడివి కొంచెం పెంచుకుంటూ పోవాలి. ముఖ్యంగా రాత్రిళ్లు పాలు ఇవ్వడం వల్ల తల్లి మెదడు నుంచి ప్రొలాక్టిన్ ఎక్కువ స్రవిస్తుంది. పాల ఉత్పత్తికి కావాల్సిన ముఖ్యమైన హార్మోన్. ఎంత రాత్రి అయిన తల్లి పాలు ఇవ్వడం బిడ్డకు క్షేమం. బిడ్డ బరువు మరీ తక్కువగా 1.5కేజీల కన్నా తక్కువగా అనారోగ్యంగా ఉన్నా తల్లిపాలు పిండి ఇవ్వడం ఎంతో అవసరం.
ముఖ్యంగా తల్లి ఆందోళనలను తగ్గించే విధంగా డాక్టర్లు కుటుంబం తనకు ఆసరాను ఇవ్వాలి. తన పాలే బిడ్డకు అన్నింటికంటే ముఖ్యమైన మందు అని, తల్లి సైతం భావించాలి. తల్లిపాలు సులభంగా పిండటానికి ఇప్పుడు చాలా అధునాతన బ్రెస్ట్ పంప్స్ లభిస్తున్నాయి. నిస్సంకోచంగా వాటిని వాడొచ్చు. మెటర్నటీ లీవ్ తక్కువగా ఉండే ఉద్యోగస్తులు సైతం వీటిని ఉపయోగించుకోవచ్చు. అనారోగ్యంగా ఉన్న బిడ్డకు ఆస్పత్రిలో అయితే ట్యూబ్ ద్వారా పాలు పడతారు. పిండిన పాలు గది ఉష్ణోగ్రతలో 6 గంటలు, సాధారణ ఫ్రిడ్జిలో ఒకరోజు పాటు నిల్వ ఉంచుకోవచ్చు. ఆరోగ్యంగా ఉన్న బిడ్డకు పిండి ఉంచిన పాలు ఉగ్గు గిన్నెలో పట్టవచ్చు. సాధారణ జలుబు హెచ్ ఐ వీ ఇన్‌ఫెక్షన్ వరకు ఎటువంటి జబ్బులు ఉన్నాబిడ్డకు పాలు ఇవ్వడం ఆపనవసరం అసలే లేదు. కరోనా సోకినా కూడా తల్లులు జాగ్రత్తలు తీసుకొని పాలు ఇవ్వవచ్చు. కానీ రొమ్ములో చీము, రొమ్ము గడ్డకట్టడం వంటివి జరిగితే తాత్కాలికంగా ఆవైపు పాలు ఇవ్వడం ఆపాలి. అదేవిధంగా క్యాన్సర్ మందుల వాడకంలో పాలు ఇవ్వకూడదు.