మన దేశంలో ప్రతి ఒక్కరికి ఐడెంటిటీ కార్డు అనేవి తప్పని సరి అయ్యాయి. ఐడెంటిటీ కార్డులు లేకుంటే భారత దేశంలో నివసించడం నేరం అవుతుంది. అలాగే ఐడెంటిటీ కార్డ్స్ తో పాటు పాస్ పోర్టు.. పాన్ కార్డు వంటవి కూడా ప్రస్తుత కాలం తప్పని సరి అవుతున్నాయి. ముఖ్యం గా ఆధార్ కార్డు కూడా దేశ పౌరులకు తప్పని సరి అవుతున్నాయి. ఇలాంటి కార్డులు ఉండటం వల్లే ప్రభుత్వాల నుంచి వచ్చే స్కీం లు అన్నీ కూడా సక్రమంగా మన వరకు అందుతాయి.
Advertisement
Advertisement
అంతే కాకుండా చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి. అయితే ఎవరైనా చనిపోయిన సమయం లో ఈ ఐడెంటిటీ కార్డు లను ఏం చేయాలో చాలా మందికి తెలియదు. దీంతో ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు. దీంతో చాలా ఇబ్బందులు ఎదురు అవుతాయి. ప్రస్తుతం కాలం లో ఐడెంటిటీ కార్డు లతో చాలా నేరలు చేస్తున్నారు. అంతే కాకుండా నఖిలీ గుర్తింపు కార్డు లను కూడా సృష్టించి మోసాలకు పాల్పడుతున్నారు. అయితే గుర్తింపు కార్డుల తో మోసాలు చేసే వారికి.. చనిపోయిన వారి గుర్తింపు కార్డు లు లభిస్తే.. చాలా ఇబ్బందులు ఎదురు అవుతాయి.
కాబట్టి ఎవరైనా.. చనిపోతే వారి గుర్తింపు కార్డులు పాస్ పోర్ట్.. పాన్ కార్డ్, ఓటర్ కార్డు, ఆధార్ కార్డు లను భద్రం గా దాచే బాధ్యత కుటుంబ సభ్యులదే అవుతుంది. పాస్ పోర్ట్ కు కాల పరిమితి ఉంటుంది.. కాబట్టి కొన్ని రోజుల తర్వాత ఆటోమెటిక్ గా పాస్ పోర్ట్ క్యాన్సిల్ అవుతుంది. అలాగే ఓటర్ కార్డు ను ప్రభుత్వ కార్యాలయాల్లో తొలగించ వచ్చు. మిగితా వాటిని కూడా కుటుంబ సభ్యులే భద్రం గా దాచాలి. లేకుంటే అనేక ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది.