వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్ మన దేశంలోనే జరుగుతున్న సంగతి తెలిసిందే. మరో నాలుగు రోజుల్లోనే వన్డే వరల్డ్ కప్ టోర్నమెంట్ ప్రారంభం అవుతుంది. అక్టోబర్ ఐదో తేదీ నుంచి నవంబర్ 19వ తేదీ వరకు ఈ మెగా టోర్నీ ఇండియాలోని అన్ని స్టేడియాలలో జరగనుంది. దీంతో ఐసీసీ మరియు బీసీసీఐ రెండు ఈ మెగా టోర్నీ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇక వన్డే వరల్డ్ కప్ ఆడేందుకు… 9 దేశాలు ఇప్పటికే ఇండియాకు చేరి ప్రాక్టీస్ మ్యాచ్లు, వామప్ మ్యాచ్లో ఆడేస్తున్నాయి.
ఇలాంటి తరుణంలో ఆసియా కప్ లో జరిగిన భారీ తప్పిదం వన్డే వరల్డ్ కప్ లో జరగబోతుందని కొంతమంది సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆసియా కప్ 2023 టోర్నమెంట్లో ప్రతి మ్యాచ్కు వర్షం అడ్డంకి గా మారిన సంగతి తెలిసిందే. దీంతో ప్రతి మ్యాచ్లో డక్వర్తులు లుఇస్ పద్ధతిని… అలాగే కొన్ని మ్యాచ్లను రద్దు చేయడం జరిగింది. అయితే ఈ వన్డే వరల్డ్ కప్ లోను భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతోంది.
Advertisement
Advertisement
ఇప్పటికే ఇండియా మరియు ఆస్ట్రేలియా తదితర దేశాలు నిన్న ఆడాల్సిన వామప్ మ్యాచులు వర్షం కారణంగా… రద్దయిన సంగతి తెలిసిందే. దీంతో క్రికెట్ అభిమానులలో కొత్త భయం చోటుచేసుకుంది. వామప్ మ్యాచ్లు సందర్భంగా వర్షాలు కురుస్తున్నాయని… మెగా టోర్నీ ప్రారంభం అయ్యాక వర్షాలు పడితే చాలా ఇబ్బంది అవుతుందని క్రికెట్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెగా టోర్ని ప్రారంభమయ్యాక వర్షాలు పడితే… బీసీసీఐకి భారీ నష్టం వాటిల్లుతుందని కూడా చెబుతున్నారు. మరి వరుణుడు ఎలా ఎప్పుడు ఎలాంటి సిచువేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి.
ఇవి కూడా చదవండి
- Singer Damini : నాకింకా పెళ్లి కాలేదు.. సహజీవనం చేస్తా !
- ఐ లవ్ యు అంటూ వెంకటేష్ కూతురుకి టాలీవుడ్ హీరో వేధింపులు ?
- హైటెక్ సిటీలోనూ చంద్రబాబు స్కాం చేశాడా? ఏకంగా 150 కోట్లు కొట్టేశాడా?