పుట్టిన ప్రతి వారు మరణించడం సహజం.. ఈ భూమ్మీద ప్రతి రోజు ఎంతో మంది పుడుతూనే ఉంటారు ఎంతో మంది మరణిస్తూనే ఉంటారు. ఇవి సహజ సిద్ధంగా జరిగేవి. వీటిని ఎవరు ఆపలేరు.. అలాంటి వాటిలో మరణం ఒకటి.. సాధారణంగా మరణించినవారి వస్తువులు మనం వాడవచ్చా.. లేదా అనేది ప్రతి ఒక్కరీ మైండ్ లో ఉన్న ప్రశ్న.. దానికి సమాధానం ఏంటో ఒకసారి చూడండి..
సాధారణంగా మరణించే ముందు ఒక్కొక్కరు ఒక్కో స్థితిలో మరణిస్తారు. అందులో ముఖ్యమైంది వారు మరణించే స్థితి మాత్రమే.
Advertisement
ఎందుకంటే కొన్ని మరణాలు సహజంగా, శరీర బంధం తెగిపోతూ సంభవిస్తాయి. కొంతమంది బలవంతపు కర్మలతో, దుర్భరమైన స్థితిలో మరణిస్తారు. కొన్ని మరణాలు దుష్ప్రభావాల చేత సంభవిస్తాయి. ఒక వ్యక్తి మరణించేటప్పుడు ఆత్మ అతనికి సంబంధించిన చాలా మంది వ్యక్తులతో, వస్తువులతో, జ్ఞాపకాలతో జీవితం గడిపి ఉంటుంది. అలా మరణం సంభవించినప్పుడు ఆత్మ అన్నింటినీ కోల్పోతుంది. ఇందులో అందరి ఆత్మ ఒకే విధంగా ఉండదు. మరణానంతరం ఒక్కొక్క ఆత్మకు ఒక్కొక్క స్థితి ఉంటుంది.
Advertisement
అయితే కొందరు చనిపోయిన వ్యక్తుల వస్తువులు కానీ బట్టలు కానీ వారి జ్ఞాపకంగా ఉంచుకుంటారు. మరికొందరు వారితో పాటే ఆ బట్టలను వస్తువులను దహనం కానీ, సమాధి కానీ చేస్తూ ఉంటారు. మరికొందరు వాటిని దానం చేస్తారు. మరికొందరు వాటిని ధరిస్తారు. ఒకవేళ మరణించిన వ్యక్తి స్థితి సరిగా లేకుండా, దుష్ప్రభావాలతో మరణిస్తే అటువంటి ఆత్మను అంచనా వేయడం అంత సులభం కాదు. కాబట్టి వారికి సంబంధించిన వస్తువులను బట్టలను వారితో పాటు వదిలేయడం మంచిదని శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు.
also read:
- స్నేహితుడని నమ్మి బైక్ పై వెళ్ళింది.. చివరికి ప్రాణాలు పోగొట్టుకుంది.. ఏం జరిగిందంటే..?
- “సాయిపల్లవిని” అలా చూడలేకపోతున్నామన్న ఫ్యాన్స్.. కారణం తెలిస్తే..?