సాధారణంగా మనం రోడ్డుపైన వెళ్తున్నప్పుడు బైకులు వెంట కార్ల వెంట కుక్కలు అరుస్తూ పరిగెత్తడం చూస్తూనే ఉంటాం. దానికి గల కారణాలు చాలామందికి తెలియదు. సైంటిస్టులు ఈ విషయంపై రీసెర్చ్ చేసి కొన్ని అంశాలను చెప్పడం జరిగింది. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం…. సాధారణంగా కుక్కలు మాంసాహార జంతువులు. వాటికి వెంటాడే స్వభావం ఉంటుంది. మనం బైకు లేదా కారు మీద ఎన్నో ప్రదేశాల్లో తిరుగుతూ ఉంటాము.
దాని ద్వారా కొన్ని రకాల వాసనలు టైర్లకు అంటుతాయి. ఆ వాసనని కుక్కలు చాలా త్వరగా పసిగట్టి వాటి వెంట పడుతూ ఉంటాయి. కుక్కలతో చాలా రకాల ఆటలు ఆడుతూ ఉంటారు. అలా ఆడే సమయంలో కొన్ని వస్తువులను ఉపయోగిస్తూ ఉంటారు. ఇక అలానే రోడ్లమీద కార్లు లేదా బైకులు వెళ్తున్నప్పుడు ఆ టైర్లని కానీ ఇతర వస్తువులను చూసి అవి కూడా ఆడుకునే వస్తువులు అనుకోని వెంటాడుతూ ఉంటాయి. కొన్ని రకాల కుక్కలు చాలా బలంగా ఉంటాయి. వాటి బలాన్ని నిరూపించుకోవడానికి కూడా ఇలా వెంటపడతాయి.
Advertisement
Advertisement
కుక్కలు తిరిగే చోట ఎవరైనా కొత్త బైక్లు, కార్లు వస్తే కుక్కలు వెంటనే గుర్తించి వాటి వెంటా పరిగెడతాయి. అలా కుక్కలు చేయడం వల్ల అటు మనుషులకి, కుక్కలకి కూడా నష్టం జరుగుతుంది. అంతేకాకుండా ఎవరైనా కొత్త వ్యక్తులు కనిపిస్తే చాలు కుక్కలు అరుచుకుంటూ వెంబడిస్తాయి. ఇక మరీ ముఖ్యంగా రాత్రి సమయంలో కుక్కలు ఎవరైనా కొత్త వ్యక్తులు కనిపిస్తే చాలు ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోయే వరకు వారి వెంటపడుతూనే ఉంటాయి.
మరిన్ని క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి ! తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.