Home » సాయి పల్లవి సక్సెస్ సీక్రెట్ ఏంటీ…?

సాయి పల్లవి సక్సెస్ సీక్రెట్ ఏంటీ…?

by Venkatesh

తెలుగు సినిమాలో ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయిన వారిలో సాయి పల్లవి ముందు వరుసలో ఉంటుంది. సాయి పల్లవి నటన, డాన్స్, ఆమె హావభావాలు ఇలా ప్రతీ ఒక్కటి కూడా సోషల మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. సాయి పల్లవి ఈ మధ్య కాలంలో ఇతర భాషల కంటే తెలుగు మీదనే ఎక్కువ ఫోకస్ చేసింది అంటున్నారు. అసలు సాయి పల్లవి అంతగా హిట్ అవ్వడానికి కారణం ఏంటీ…?

ఫిదా సినిమా ద్వారా తెలుగులో అడుగుపెట్టిన ఈ అమ్మడు నటనతో ఆదరగోట్టింది. భాష నేర్చుకోవటం ఒక విషయం అయితే… అందులో యాస నేర్చుకుని దాదాపు పర్ఫెక్ట్‌గా మాట పలకటం మరో ఎత్తు. ఆ యాసలో భావానికి సరిగ్గా నటించటం నిజంగా అద్భుతం అనే చెప్పాలి. ఫిదాలో తన అక్కను బాగా చూసుకుంటారని నమ్మకం వచ్చినట్టు చెప్పే సందర్భంలో సాయి పల్లవి నటనకు ఫిదా అవుతారు  ఫ్యాన్స్ .

Sai Pallavi - Wikipedia

హీరోతో నడుస్తూ పరిచయం చేసుకునే సన్నివేశంలో సాయి పల్లవి జీవించింది అనే చెప్పాలి. ఇక చిరునవ్వును పెదవులు కదలకుండా కళ్ళతో పలికించే సామర్ధ్యం ఆమె సొంతం. ఇక కోపాన్ని పెదవులు, కళ్ళతో పాత్రమే కాకుండా వొంటి విరుపుతో కూడా ఆమె చాలా అందంగా చేస్తుంది. డాన్స్ విషయానికి వస్తే హీరో ఆమెతో పోటీ పడటం సాధ్యం కాని పని. ఆమె ఏ సినిమా చేసినా సరే సినిమాలో పాత్రకు తగిన విధంగా తనను తాను స్వయంగా మార్చుకుంటూ ఉంటుంది. డాన్స్ విషయంలో ఫ్యాన్స్ . కి బోర్ కొట్టే విధంగా ఉండదు.

Visitors Are Also Reading