Home » టాలీవుడ్‌ నటి రాశికి వేణుకు మధ్య ఉన్న రిలేషన్‌ ఏంటి..?

టాలీవుడ్‌ నటి రాశికి వేణుకు మధ్య ఉన్న రిలేషన్‌ ఏంటి..?

by Bunty
Ad

 

మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది నటీనటులు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది మాత్రమే పాపులర్ అవుతారు. కొంతమంది ఇండస్ట్రీలో తమ కుటుంబానికి చెందిన వారి సహాయంతో ఇండస్ట్రీని ఏలుతారు. మరి కొంతమంది చాలా కష్టపడి పైకి వస్తారు. అలా ఇండస్ట్రీలో చాలా కష్టపడి రాణించిన వారిలో నటి రాశి ఒకరు. నటి రాశి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో సౌందర్యకు పోటీగా నటి రాశి దూసుకు వెళ్ళింది.

What is the relationship between Tollywood actress Rashi and Venu

What is the relationship between Tollywood actress Rashi and Venu

చెన్నైలో పుట్టి పెరిగిన నటి రాశి… బాలనాటిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. తన కెరీర్ ప్రారంభంలో గోకులంలో సీతా మరియు శుభాకాంక్షలు సినిమాలతో మంచి పేరు తెచ్చుకుంది నటి రాశి. ఆ తర్వాత ఇండస్ట్రీలో మోస్ట్ హీరోయిన్గా మారిపోయింది. ప్రస్తుతం సీరియల్స్ కూడా చేస్తుంది నటి రాశి. అయితే.. ప్రస్తుతం సినిమాలతో పాటు సీరియల్ లోను కూడా నటిస్తున్న హీరోయిన్ రాశి ఒకప్పుడు స్టార్ హీరోలు అందరితో నటించింది.

Advertisement

సినిమాల్లో నటిస్తున్న సమయంలోనే హీరోయిన్ రాశి హీరో వేణు తొట్టెంపూడి తో ప్రేమలో పడిందని టాక్ వచ్చింది. వీరిద్దరూ మనసు పడ్డారు కానీ చిత్రంలో కలిసి నటించారు. ఆ సమయంలోనే వీరి మధ్య మంచి స్నేహబంధం ఏర్పడిందని ఆ స్నేహం కాస్త ప్రేమగా మారిందని వార్తలు వచ్చాయి. ఇక వీరిద్దరూ అప్పుడప్పుడు బయట కలుసుకోవడంతో వీరు రిలేషన్ లో ఉన్నట్టు రూమర్స్ వచ్చాయి. ఈ విషయంపై వారు క్లారిటీ ఇచ్చారు. మా ఇద్దరి మధ్య ఎటువంటి రిలేషన్ లేదని తాము మంచి స్నేహితులమని చెప్పుకొచ్చింది.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading