Home » హీరోయిన్ రాశి, వేణు మధ్య అలాంటి రిలేషన్‌ ఉందా..?

హీరోయిన్ రాశి, వేణు మధ్య అలాంటి రిలేషన్‌ ఉందా..?

by Bunty
Ad

అలనాటి స్టార్ హీరోయిన్ రాశి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగినటువంటి వారిలో రాశి కూడా ఒకరు. తన నటన, అందంతో ఎంతోమంది ప్రేక్షకుల మనసులను దోచుకుంది. అలనాటి స్టార్ హీరోలు అందరి సరసన నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంది. తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ చిత్రాల్లో కూడా నటించింది. రాశి సినిమాల్లో నటిస్తున్న సమయంలోనే తొట్టెంపూడి వేణుతో ప్రేమలో పడిందని వార్తలు వైరల్ గా మారాయి.

Advertisement

వీరిద్దరి కాంబోలో వచ్చిన సినిమా ‘మనసు పడ్డాను కానీ’. ఈ సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడిందని, ఆ స్నేహం కాస్త ప్రేమగా మారిందని ఇండస్ట్రీవర్గాల్లో టాక్ వినిపించింది. ఇక వీరిద్దరూ అప్పుడప్పుడు బయట కలుసుకోవడం వల్ల వీరిద్దరి మధ్య ఏదో రిలేషన్ ఉందని రూమర్స్ వచ్చాయి. ఈ విషయంపై వారు ఆ సమయంలోనే క్లారిటీ ఇచ్చారు. మా ఇద్దరి మధ్య మంచి స్నేహం మాత్రమే ఉంది అని చెప్పుకొచ్చారు.

Advertisement

ఇక రాశి ప్రస్తుతం సినిమాలతో పాటు సీరియల్లలో కూడా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇక వేణు ఒకప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలుగు వెలిగారు. ఏమైందో తెలియదు కొన్ని రోజులకి ఎలాంటి సినిమాల్లో నటించకుండా కనుమరుగైపోయారు. ఇండస్ట్రీలో ఎప్పుడు ఎలా సక్సెస్ వస్తుందో ఎలా పోతుందో చెప్పలేము అనడానికి వేణు నిదర్శనం. ఇక చాలాకాలం తర్వాత వేణు ‘అతిధి’ అనే వెబ్ సిరీస్ లో నటించాడు. ఈ సిరీస్ అద్భుత విజయాన్ని అందుకుంది. దీంతో వేణు మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తారా లేదా అనేది చూడాలి.

ఇవి కూడా చదవండి

Visitors Are Also Reading