తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఆర్మీ ఛీఫ్ బిపిన్ రావత్ మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే బిపిన్ రావత్ తన భార్య మరియు సిబ్బందితో ప్రయాణించిన ఈ హెలికాప్టర్ రష్యా దేశంలో తయారైంది. దీనిని ఎంఐ17 వీ5 హెలికాప్టర్ అని అంటారు. దీనిని ప్రధానంగా సైనిక రవాణా కోసం ఉపయోగిస్తున్నారు. ఈ హెలికాప్టర్ భారత్ మాత్రమే కాకుండా ఇరాన్, ఇరాక్, అమెరికా మరికొన్ని దేశాలు కూడా ఉపయోగిస్తున్నాయి.
Advertisement
రెండు ఇంజన్లు కలిగి ఉండటమే ఈ హెలికాప్టర్ యొక్క ప్రత్యేకత…ఈ హెలికాప్టర్ తో పెట్రోలింగ్, రెస్య్కూ ఆపరేషన్లు సరుకు రవాణాకు కూడా ఉపయోగిస్తుంటారు. ప్రపంచంలో ఉన్న రవాణాలకు ఉపమోగించే హెలికాప్టర్ లలో ఇది కూడా ముఖ్యమైనది. అంతే కాకుండా పేలుడు సామాగ్రిని కూడా రవాణా చేసేందుకు వాడుతుంటారు. రక్షణ మంత్రి లాంటి వీవీఐపీలు ఈ హెలికాప్టర్ లలోనే మారుమూల ప్రదేశాలకు వెళుతుంటారు.
Advertisement
సముద్ర ప్రాంతాలు ఎడారి ప్రాంతాల్లో కూడా ఎలాంటి ఇబ్బందులు పడకుండా వెళ్లేలా ఈ హెలికాప్టర్ లను తయారు చేశారు. ఇక ఇటీవల ప్రధాన మంత్రి నరేంధ్ర మోడీ కూడా ఈ హెలికాప్టర్ ద్వారానే లద్దాక్, కేదార్ నాత్ లలో పర్యటించారు. అయితే ఇంతటి సామథ్యం ఉన్న హెలికాప్టర్ లు తరచూ ప్రమాదాలకు గురవడానికి కారణం ఏంటన్న ప్రశ్న ఇప్పుడు గట్టిగా వినిపిస్తుంది. కాగా నిపుణులు మాత్రం ఈ హెలికాప్టర్ లను తరచూ వాడటం వల్లే ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నాయని చెబుతున్నారు. అందువల్లే 2019లో ఈ హెలికాప్టర్ ల నిర్వహణ కోసం ఓ సెంటర్ ను కూడా ఏర్పాటు చేశారు.