Home » నాగార్జున, అమల పెళ్లికి ఏఎన్నార్ దూరంగా ఉండటానికి కారణం ఏంటి ? ఆ నిర్మాతే వీరి పెళ్లి చేశాడా ?

నాగార్జున, అమల పెళ్లికి ఏఎన్నార్ దూరంగా ఉండటానికి కారణం ఏంటి ? ఆ నిర్మాతే వీరి పెళ్లి చేశాడా ?

by Anji
Ad

తెలుగు సినీ ఇండస్ట్రీలో అద్భుతమైన జంటల్లో నాగార్జున అమల ఒక్కరు. వీరిద్దరూ చాలా సినిమాల్లో జంటగా నటించి ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. తెలుగులో అమల తన రియల్ లైఫ్ పార్ట్నర్ నాగార్జునతో ఎక్కువ సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. వీరిద్దరి పెళ్లికి నాగార్జున తండ్రి అక్కినేని నాగేశ్వరావు గారు దూరంగా ఎందుకు ఉన్నారనే ఆసక్తికర విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement

నాగార్జున అమల తోలుత వెండితెరపై జోడిగా నటించిన చిత్రం కిరాయి దాదా. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. రెండో సినిమా చినబాబు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నడిచింది. నాగార్జున అమల జంటగా నటించిన మూడో చిత్రం శివ. రాంగోపాల్ వర్మ మొదటిసారి దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం నమోదు చేసింది. తెలుగు చిత్ర పరిశ్రమలోనే ఓ ట్రెండ్ సెట్టర్ మూవీ గా నిలిచిపోయింది. వీరిద్దరూ కలిసి నటించిన నాలుగో చిత్రం ప్రేమ యుద్ధం.ఐదో చిత్రం శివ.. తెలుగులో సూపర్ హిట్ అయిన ఈ చిత్రాన్ని హిందీలో శివ టైటిల్ తోనే దాదాపు అదే నటీనటులతో తెరకెక్కించారు. బాలీవుడ్ లో కూడా ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.

Advertisement

నాగార్జున అమల జోడిగా నటించిన ఆరో చిత్రం నిర్ణయం. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ తాకు తెచ్చుకుంది. వీరిద్దరూ కలిసి మొత్తం ఆరు సినిమాల్లో నటిస్తే.. అందులో ఐదు తెలుగు సినిమాలు ఒకటి హిందీ రీమేక్. దాదాపు ఎక్కువ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచాయి. నాగార్జున అమల చివరగా నిర్ణయం మూవీలో నటించారు. ఈ సినిమాలో నటించిన అప్పుడే వారి జీవితానికి సంబంధించిన ఓ పెద్ద నిర్ణయం తీసుకొని మూడు ముళ్ల బంధంతో 1992 జూన్ 11న తిరుపతిలో వీరి వివాహం జరిగింది. వీరి పెళ్లికి అక్కినేని నాగేశ్వరరావు ఒప్పుకోలేదు. అన్నమయ్య కిరాయి దాదా సినిమాలను నిర్మించిన దొరస్వామి రాజు తిరుపతిలో దగ్గరుండి వీరి పెళ్లి జరిపించారు. పెళ్లయిన తర్వాత నాగేశ్వరరావు అన్నపూర్ణమ్మ దంపతులు వీరిని ఆశీర్వదించారు. పెళ్లి తర్వాత నాగార్జునకు జంటగా అమలు ఏ సినిమాలో నటించలేదు కానీ మనం సినిమాలో మాత్రం గెస్ట్ పాత్రలో నటించింది.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

అన్వేష్ ప్రేమ- పెళ్లి- విడాకులపై కీలక వ్యాఖ్యలు!

ఖుషి సినిమా చూసి థియేటర్ నుంచి కోపంతో బయటకు వచ్చిన నాగచైతన్య ?

Visitors Are Also Reading