ఇండస్ట్రీలో తారక్ కి మంచి నేమ్ ఉంది. ఆన్ స్క్రీన్ ఆయన గురించి కాసేపు పక్కన పెడితే.. ఆఫ్ స్క్రీన్ ఆయన చాలా జోవియల్ గా ఉంటారు అన్న పేరు ఉంది. అయితే.. అలాంటి తారక్ తో రాజీవ్ కనకాల గొడవ ఏమిటా అని ఆలోచిస్తున్నారా? ఈ ఆర్టికల్ పూర్తిగా చదివితే విషయం మీకే అర్ధం అవుతుంది. ఎన్టీఆర్ కు, రాజీవ్ కనకాల కు ఎన్టీఆర్ సినిమా ఇండస్ట్రీకి వచ్చిన మొదటి రోజు నుంచే పరిచయం ఉంది. ఎన్టీఆర్ మొదటి సినిమా నిన్ను చూడాలని. ఈ సినిమాకి ఎన్టీఆర్ కి డబ్బింగ్ చెప్పాల్సిందిగా రాజీవ్ కనకాలని అడిగారట.
Advertisement
అయితే.. ఆయనకి తన వాయిస్ సూట్ అవ్వడాన్ని చెప్పడంతో ఆ సినిమాకి ఎన్టీఆర్ నే డబ్బింగ్ చెప్పుకున్నారు. తరువాత సినిమా స్టూడెంట్ నెంబర్ 1 అన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రాజీవ్ కనకాల కూడా నటించారు. ఈ సినిమాకు రాజమౌళి దర్శకత్వం వహించారు. ఈ సినిమా షూటింగ్ మొదటి రోజే ఎన్టీఆర్ కు రాజీవ్ కనకాల చిన్న గొడవ అయిందట. మొదటి రోజు మధ్యాహ్నమే రాజీవ్ కనకాల మీద ఎన్టీఆర్ ఎదో కామెంట్ చేశారట. రాజీవ్ ఫ్రెండ్ చంద్రశేఖర్ స్టయిలిష్ కళ్లజోళ్లు తీసుకొస్తే అవి తన పాత్రకి బాగా సూట్ అవుతాయని రాజీవ్ పెట్టుకున్నారట.
Advertisement
అయితే అవి చూసి ఎన్టీఆర్ అవసరమా అంటూ కామెంట్ చేశారట. దీనితో కోపం వచ్చిన రాజీవ్ రాజమౌళి దగ్గరకి వెళ్లి ఈ సినిమా చేయనని చెప్పారట. ఆయన ఏదోకటి అంటారు..నాకు కోపం వస్తే నేను ఏదోకటి మాట్లాడతాను. చివరకు నన్నే అంటారు.. అందుకే ఈ సినిమా చెయ్యను అని చెప్పారట. దీనితో ఆయనేదో సరదాగా అంటే ఎందుకంత సీరియస్ గా తీసుకుంటారు అంటూ రాజమౌళి నచ్చచెప్పారట. రెండవ రోజు నమస్కారం, రండి సార్ అంటూ ఎన్టీఆర్ పిలిచేసరికి రాజీవ్ షాక్ అయ్యారు. మూడోరోజు మళ్ళీ ఎదో జోక్ చేశారట. ఇక నాలుగవ రోజుకు బాగా క్లోజ్ అయ్యాం అని రాజీవ్ చెప్పుకొచ్చారు. ఎంతలా క్లోజ్ అంటే.. రాజీవ్ గారు అని పిలిచే తారక్ అరేయ్, ఒరేయ్ రాజాగా అని పిలిచేంతగా.. అని రాజీవ్ చెప్పుకొచ్చారు.