Telugu News » పెట్రోల్ డీజిల్ ల మ‌ధ్య తేడా ఏంటి.. ?

పెట్రోల్ డీజిల్ ల మ‌ధ్య తేడా ఏంటి.. ?

by Azhar
Published: Last Updated on

పెట్రోల్ డీజీల్ మ‌ధ్య తేడా ఏంట‌న్న‌ది చాలా మందికి తెలియదు. త‌ర‌చూ ఈ రెండు ఇంధ‌నాలను వాడుతాం కానీ అస‌లు రెండింటి మ‌ధ్య తేడా ఏంట‌ని అడిగితే మాత్రం చెప్ప‌లేం. రెండు ఇంధ‌నాల మ‌ధ్య చిన్నపాటి తేడా ఉంది కాబ‌ట్టే వాటిని విడిగా చేసి వాడుతుంటారు. ఇక‌ ఆ రెండు ఇంధ‌నాల మ‌ధ్య తేడా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..భూమిలొ దొరికే ముడి చ‌మురు నుండి ఫ్రాక్ష‌న‌ల్ డిస్లేష‌న్ అనే ప‌ద్ధ‌తి ద్వారా పెట్రోల్ మ‌రియు డీజిల్ ల‌ను తయారు చేస్తారు. ముందుగా డీజిల్ ల‌భిస్తుంది. ఆ త‌ర‌వాత పెట్రోల్ ల‌భిస్తుంది. అందుకే డీజిల్ ధ‌ర త‌క్కువ‌గా ఉంటుంది. డీజిల్ కు ఎక్కువ‌ టార్క్ ఉంటుంది. పెట్రోల్ లో అయితే టార్క్ త‌క్కువ‌గా ఉంటుంది.

Ads

ఇవి కూడా చదవండి: అప్ప‌ట్లో మా టీచ‌ర్లు…. ఈ పాఠం చెప్ప‌డ‌మే ఎగ‌ర‌గొట్టేవారు!

టార్క్ ఎక్క‌వ బ‌రువును తీసుకువెళ్లే సామ‌ర్థ్యాన్ని క‌లిగి ఉంటుంది. టార్క్ అంటే రొటేటింగ్ ఫోర్స్ అని అర్థం. ఈ టార్క్ ఉండ‌టం వ‌ల్లే డీజిల్ ను హెవీ వెయికిల్స్ లారీలు, బ‌స్సుల్లో వాడుతుంటారు. టార్క్ ఎక్కువ‌గా ఉండ‌టం వ‌ల్ల ఎత్తైన ప్ర‌దేశాల్లో,,ఘాట్ రోడ్డుల్లో ప్ర‌యాణించ‌వ‌చ్చు. అంతే కాకుండా టార్క్ త‌క్కుగా ఉండ‌టం వ‌ల్లే చిన్న వాహ‌నాలు బైకులు మ‌రియు కొన్ని కార్ల‌లో వాడుతుంటారు. బైక్ లు కార్ లు బ‌రువు త‌క్కువ‌గా ఉంటాయి కాబ‌ట్టి వాటిలో పెట్రోల్ ను వాడుతుంటారు. అంతే కాకుండా డీజిల్ చిక్క‌గా ఉంటుంది. అందువ‌ల్ల డీజిల్ మెల్లిగా ఆవిర‌వుతుంది. అందువ‌ల్లే ఎక‌నామిక‌ల్ గా కూడా డీజిల్ ఉత్త‌మ‌మైన‌ది. డీజిల్ ఇంజ‌న్లకు ఎక్కువ మెయింటెనెన్స్ ఉంటుంది.

అదే విధంగా పెట్రోల్ ఇంజ‌న్ల‌కు త‌క్కువ మెయింటెనెన్స్ ఉంటుంది. కాబ‌ట్టి బైక్ కంటే కార్లు ఇత‌ర పెద్ద వాహ‌నాలు కొన్న‌ట్లైతే వాటికి మెయింటెనెన్స్ ఎక్కువ అని చెబుతుంటారు. పెట్రోల్ ఇంజ‌న్లు వేగంగా ప‌నిచేస్తాయి. అందువ‌ల్లే గాడిద‌లా ఎక్కువ ప‌నిచేయాల‌ని పెద్ద వాహ‌నాల‌కు డీజిల్ ఇంజన్లను వాడుతుంటారు. ఇక త‌క్కువ పని వేగంగా చేయాల‌ని బైకుల‌కు పెట్రోల్ ఇంజ‌న్లను వాడుతుంటారు. డీజిల్ నుండి ప్ర‌కృతికి హాని క‌లిగించే వాయువులు ఎక్కువ‌గా వెలుబ‌డ‌తాయి.

Also Read: కేసీఆర్ పేరు పెట్టిపిలిచే జ‌ర్న‌లిస్ట్ రాహుల్ ఎవ‌రు..ఎందుకంత స్పెష‌ల్..!


You may also like