ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తున్న పేరు బిట్ కాయిన్…మొదట్లో ఆన్ లైన్ పేమెంట్స్ వచ్చినప్పుడు అంతా ఆశ్చర్యపోయారు. యూపీఐ పేమెంట్స్ వాడాలంటేనే బయపడ్డారు. కానీ ప్రస్తుతం అవి మన జీవితంలో అలవాటు అయిపోయాయి. ఇక ఇప్పుడు మన జీవితాల్లోకి మరో టెక్నాలజీ వచ్చింది. అదే బిట్ కాయిన్ అని పిలుచుకునే క్రిప్టో కరెన్సీ..విదేశాల్లో బిట్ కాయిన్ కు ఫుల్ క్రేజ్ వచ్చేసింది. బిట్ కాయిన్ ను మనం చూడలేం తాకలేం అదో డిజిటల్ కరెన్సీ. మొదట్లో ఒక బిట్ కాయిన్ కు విలువ ఉండేది కాదు ఐదు లేదా ఆరు రూపాయలకే బిట్ కాయిన్ వచ్చేది. కానీ ఇప్పుడు ఒక్కో బిట్ కాయిన్ ధర పదిహేను లక్షలకు చేరింది. నాగరికత ప్రారంభంలో డబ్బు అనేది ఆహార ధాన్యాలు పశువులు వస్తువుల రూపంలో ఉండేది.
Advertisement
ఆ తరవాత బంగారు వెండి నాణేలు వచ్చాయి. ఇక ఇప్పుడంతా డిజిటల్ కరెన్సీ రూపంలో మారిపోంతుంది. ఎంతలా అంటే ప్రపంచంలో ఉన్న మొత్తం కరెన్సీలో ఎనిమిది శాతం మత్రమే నోట్ల రూపంలో ఉంది. 92శాతం డిజిటల్ కరెన్సీ రూపంలోనే ఉంది. ఇక ఆ తరవాత రాబోతున్న కరెన్సీనే బిట్ కాయిన్…మొదట 2008 అక్టోబర్ లో బిట్ కాయిన్ వైట్ పేపర్ అనే తొనిమిది పేజీల డాక్యుమెంట్ అనేది పబ్లిష్ అయ్యింది. దీనిలో బిట్ కాయిన్ అనే క్రిప్టోకెన్సీనిని ప్రవేశపెడుతున్నామని సతోషి నకామోటో అనే వ్యక్తి ప్రకటించాడు. సింపుల్ గా చెప్పాలంటే బిట్ కాయిన్ ఒక ఆన్ లైన్ కరెన్సీ దీని విలువను ఎవరూ కంట్రోల్ చేయలేరు. మన రూపాయిని ఆర్బీఐ కంట్రోల్ చేస్తుంది.
Advertisement
అలా ఏ దేశ కరెన్సీని ఆ దేశ బ్యాంకులు కంట్రోల్ చేస్తాయి. కానీ బిట్ కాయిన్ విలువను అలా ఎవరూ కంట్రోల్ చేయలేరు. ఇదో డీ సెంట్రలైజిడ్ కరెన్సీ….ప్రపంచంలోని ఎక్కడి వారైనా ఎక్కడికైనా పంపుకోవచ్చు. మన రూపాయిలో పైసలు ఉన్నట్టే బిట్ కాయిన్ కు పది కోట్ల సాతషీలు ఉంటాయి. ఇక బిట్ కాయిన్ తయారు చేసిన సాతొషీ ఓ రూల్ పెట్టాడు. ప్రపంచంలో కేవలం 21 మిలియన్ బిట్ కాయిన్ లు మాత్రమే ఉండాలని రూల్ పెట్టాడు. ఈ రూల్ పెట్టడం వల్లే బిట్ కు డిమాండ్ పెరిగింది. ఇక త్వరలోనే బిట్ కాయిన్ ను పేటీయం కూడా ట్రేడింగ్ చేయబోతున్నట్టు ప్రకటించింది.