ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో మ్యాచ్ లు అనేవి చాలా ఉత్కంఠంగా సాగుతున్నాయి. అయితే ఈ టోర్నీలో జట్ల ప్రదర్శనతో పాటుగా వర్షం కూడా చాలా కీలక రోల్ అనేది పోషిస్తుంది. ఈరోజు జరిగిన మ్యాచ్ తో గ్రూప్ ఏ నుండి న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్లు 7 పాయింట్లతో సెమీస్ కు చేరుకోగా.. ఆసీస్ జట్టుకు కూడా 7 పోయినట్లే ఉన్న.. నెట్ రన్ రేట్ వల్ల ఆ జట్టు సెమీస్ కు వెళ్లలేదు.
Advertisement
అయితే ఈ టోర్నీలో వర్షం వల్ల రద్దు అయిన మ్యాచ్ లలో ఇంగ్లాండ్, ఆసీస్ మధ్య జరగాల్సిన మ్యాచ్ కూడా ఉంది. ఒకవేళ ఈ మ్యాచ్ క్యాన్సిల్ కాకపోతే.. సెమీస్ కు ఆసీస్ వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే రేపు మన ఇండియా ఉన్న గ్రూప్ బిలోని అన్ని మ్యాచ్ లు జరగనున్నాయి. ఇక ఈ అన్ని మ్యాచ్ లకు కూడా వర్షం భయం అనేది ఉంది.
Advertisement
ఒకవేళ రేపు జరగనున్న ఇండియా, జింబాబ్వే మ్యాచ్ లో వర్షం పడితే ఏంటి పరిస్థితి అని చాలా మంది అనుకుంటున్నారు. అయితే రేపు మ్యాచ్ అనేది రద్దు అయిన మనకు ఏ సమస్య ఉండదు. ఎందుకంటే.. మ్యాచ్ రద్దు అయితే మనకు ఒక్క పాయింట్ రావడం వల్ల 7 పాయింట్స్ మనకు అవుతాయి. దాంతో మనం నేరుగా సెమీస్ కు వెళ్తాము.
ఇవి కూడా చదవండి :