Home » గీతాంజలి చనిపోయే ముందు ఏం జరిగింది..? అసలు ఆ ఇద్దరూ ఎవరు..?

గీతాంజలి చనిపోయే ముందు ఏం జరిగింది..? అసలు ఆ ఇద్దరూ ఎవరు..?

by Sravya
Ad

ఏపీ పాలిటిక్స్ లో తెనాలి మహిళా గీతాంజలి మరణ వ్యవహారం అధికార విపక్షాల మధ్య ఆ మాటలు యుద్ధానికి అలానే సోషల్ మీడియా వారికి కారణం అవుతోంది. టిడిపి జనసేన ట్రోలింగ్ కారణంగా మానసిక వేదనతో గీతాంజలి రైలు కిందపడి మరణానికి పాల్పడిందని వైసీపీ నేతలు మంత్రులు కూడా అంటున్నారు. గీతాంజలి కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామని భరోసాని ఇస్తున్నారు. ఇదే క్రమంలో ముఖ్యమంత్రి కార్యాలయం సైతం గీతాంజలి మరణం మీద స్పందించింది ఆమె కుటుంబానికి 20 లక్షల పరిహారం ఇస్తామని ప్రకటించింది. గీతాంజలి మరణం మీద టీడీపీ నేతలు అనుమానాలు లేవనెత్తుతున్నాయి గీతాంజలి వీడియో వైరల్ అవ్వడానికి ముందే ఆమెకి ప్రమాదం జరిగిందని అంతా అంటున్నారు.

Advertisement

Advertisement

ఈ క్రమంలో గీతాంజలి రైలు కింద పడిన టైం లో ప్రయాణికులు ఎవరో తీసిన ఒక వీడియోని తెలుగుదేశం పార్టీ తన సోషల్ మీడియా ఖాతా లో పోస్ట్ చేసింది. ఘటనా స్థలంలో ప్రయాణికులు మాట్లాడుకుంటున్న వీడియోని షేర్ చేశారు. గీతాంజలి ని ఎవరో ఇద్దరు వ్యక్తులు తోసేసారని ప్రయాణికులు అందరూ చర్చించుకుంటున్నారు. రైలు పట్టాల మీదకి అమ్మాయిని నెట్టేసి పారిపోయారని అందులో మాట్లాడుకోవడం జరిగింది.

గీతాంజలి ని తోసేసింది ఎవరనేది తేల్చాలని టీడీపీ అయితే డిమాండ్ చేస్తోంది. గీతాంజలి మృతి పై వైసీపీ అసత్య ప్రచారం చేస్తోందని టీడీపీ నేత తుంగిరాల సౌమ్య అన్నారు. సజ్జా అజయ్ సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం కారణంగా మృతి చెందిందని అసత్య ప్రచారాన్ని ఖండిస్తున్నామన్నారు రైలు ప్రమాదం వల్లే గీతాంజలి చనిపోయిందని ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు మళ్లీ ఆ$త్మహ$త్య గా ఎందుకు మార్చారని అన్నారు. గీతాంజలి రైలు ప్రమాదంలో గాయపడింది ఈ నెల ఏడవ తేదీన. సబ్జా అజయ్ మాట్లాడింది పదవ తేదీ అని అన్నారు. ఆమె ఏడవ తేదీన ఆ$త్మహ$త్య చేసుకుంటే నాలుగు రోజులుగా కేసుని ఎందుకు నమోదు చేయలేదని అడిగారు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading