Home » మూల న‌క్ష‌త్రంలో పుట్టిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే క‌ష్టాలు త‌ప్ప‌వా..? అందులో నిజం ఎంత‌..?

మూల న‌క్ష‌త్రంలో పుట్టిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే క‌ష్టాలు త‌ప్ప‌వా..? అందులో నిజం ఎంత‌..?

by AJAY
Ad

కొంతమంది జ్యోతిష్యాన్ని నమ్మితే మరి కొంతమంది జ్యోతిష్యాన్ని అసలు నమ్మరు. ఎవ‌రి న‌మ్మ‌కాలు వారివి…అయితే నమ్మే వారిని ఆస‌రాగా చేసుకుని ఇత‌రుల‌కు న‌ష్టం క‌లిగిలా జ్యోతిష్యం చెప్పేవారు కూడా ఉంటారు. కాబ‌ట్టి ఏది న‌మ్మాలి ఏది న‌మ్మ‌కూడ‌దు అని అలోచించి నిర్న‌యాలు తీసుకోవాలి. సాధార‌ణంగా కొన్ని నక్షత్రాల అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే అబ్బాయిలకు నష్టం జరుగుతుందని కొంత‌మంది న‌మ్ముతారు.

ఇవి కూడా చదవండి: భార్య భ‌ర్త‌ల మ‌ధ్య గొడ‌వ‌లు లేకుండా ఉండాలంటే పాటించాల్సిన 5 నియ‌మాలు…? 3 వ‌ది చాలా ఇంపార్టెంట్..!

Advertisement

మూల నక్షత్రం కలిగిన అమ్మాయిని వివాహం చేసుకుంటే అబ్బాయి జీవితంలో ఇబ్బందులు తప్పని చెబుతుంటారు. అయితే అందులో ఎంతవరకు నిజం ఉంది అనేది ప్రాక్టికల్ గా ఆలోచిస్తే తెలిసిపోతుంది. అంతేకాకుండా కొంతమంది ప్రముఖ జ్యోతిష్యులు సైతం దీని గురించి వివరించారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం…. లోకంలో మూల నక్షత్రంలో చాలామంది అమ్మాయిలు జన్మిస్తున్నారు…జ‌న్మించారు. అంతేకాకుండా ఆ నక్షత్రంలో జన్మించిన వాళ్లు ఉన్నత స్థానంలో ఉన్న వాళ్లు కూడా ఉన్నారు.

Advertisement

Image for representation only. Photo: Shutterstock

ఆ నక్షత్రంలో పుట్టిన అమ్మాయిలు పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్న వాళ్ళు సైతం ఉన్నారు. మూల, ఆరుద్ర, జేష్ఠ నక్షత్రాలతో కలిపి మొత్తం 27 నక్షత్రాలు ఉన్నాయి. కొంతమంది చెబుతున్న దాని ప్రకారం ఈ మూడు నక్షత్రాలు కలిగిన అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే జీవితంలో నష్టాలు వస్తాయని అనుకుంటే మిగతా 24 నక్షత్రాల్లో పెళ్లి చేసుకున్న వాళ్లంతా సుఖంగా ఉండాలి.

మరి లోకంలో అంతా అలానే ఉంటున్నారా…? మూడు నక్షత్రాలు మినహా ఇతర నక్షత్రాల్లో జన్మించిన వారికి ఎలాంటి సమస్యలు రావడం లేదా…? అనేది ఆలోచించాలి. కాబట్టి ఇది కేవలం స్వలాభం కోసమో ఇతర అవసరాల కోసం సృష్టించినది మాత్రమే. మనిషికి కష్టపడే గుణం మరియు ప్రశాంతత ఉంటే ఏ నక్షత్రంలో పుట్టిన అమ్మాయితో అయినా సుఖంగా ఉండవచ్చు అని గ్రహించాలి.

ALSO READ : SR..ఎన్టీఆర్ ఆస్తులను కొట్టేసిన వారిలో ఆ స్టార్ హీరో కూడా ఉన్నారా..? ఆ రోజు రాత్రి ఏం జరిగిందంటే..?

Visitors Are Also Reading