భారత జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఇప్పుడు జరుగుతున్న చర్చ గతంలో ఏ క్రికెటర్ పైన కూడా జరగలేదు అనేది నిజం. అయితే అంతలా కోహ్లీపైన చర్చ జరగడానికి కారణం కూడా లేకపోలేదు. అదేంటంటే.. అదని క్రేజ్. అవును గతంలో ఏ క్రికెటర్ కూడా కోహ్లీ అంత క్రేజ్ లేదు. విరాట్ కోహ్లీ తన ఆటతోనే కాకుండా స్టైలిష్ లుక్స్ తోను అభిమానులను ఆకట్టుకుంటాడు.
read also : Rishabh Pant : ఢిల్లీ డగౌట్ లో రిషబ్ పంత్! ఎమోషనలైన ఫ్యాన్స్…
Advertisement
అంతర్జాతీయ సంస్థలకు ఆయనను బ్రాండ్ అంబాసిడర్ గా తీసుకోవడమే దీనికి నిదర్శనంగా చెప్పొచ్చు. స్టైలిష్ లుక్స్ తో పాటు టాటూలతోనూ అట్రాక్ట్ చేస్తుంటాడు విరాట్. టాటూలను విపరీతంగా ఇష్టపడే విరాట్ ఎప్పటికప్పుడు కొంగోత్త టాటూలతో కనిపిస్తుంటారు. ఈ నేపథ్యంలో తాజాగా చేతిపై కొత్త టాటూను వేయించుకున్నాడు విరాట్. ఈ టాటూ చూడడానికి ఆసక్తిగా ఉండడంతో అభిమానుల దృష్టి కాస్త దానిపై పడింది.
Advertisement
ఇదిలా ఉంటే తాజాగా అభిమానుల అనుమానాలను నివృత్తి చేస్తూ టాటూ ఆర్టిస్ట్ ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఏలియన్స్ టాటూ సంస్థ యజమాని సన్నీ భానుశాలి కోహాలిఈకి ఈ టాటూను వేశాడు. ఆయనే స్వయంగా ఈ టాటూ మీనింగ్ ఏంటో వివరించాడు. కొన్నేళ్ల కిందట విరాట్ కోహ్లీ తన ఆఫీసుకు వచ్చాడని చెప్పుకొచ్చారు. విరాట్ ఆయన ఫేమ్ ను కూడా పక్కనపెట్టి ఎంతో మర్యాదపూర్వకంగా మాట్లాడాడు. మమ్మల్ని ఎంతగానో అభినందించారు. నిజానికి టాటూ ఎప్పుడో వేయించుకోవాల్సి ఉన్నా, బిజీ షెడ్యూల్ తో చాలా రోజుల పాటు కుదరలేదని చెప్పుకొచ్చాడు.
read also : ఆ స్టార్ హీరో తో సౌందర్య డేటింగ్… ఆ ప్రేమకు కారణం ఇదే…!