Home » NTR : భార్య లక్ష్మి ప్రణతిని ఎన్టీఆర్ ఏమని పిలుస్తారో తెలుసా..?

NTR : భార్య లక్ష్మి ప్రణతిని ఎన్టీఆర్ ఏమని పిలుస్తారో తెలుసా..?

by Sravya

ఎన్టీఆర్ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. ఆర్ ఆర్ ఆర్ సినిమాతో తన రేంజ్ ని డబల్ చేసుకున్నారు. ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతిని ఎంతో గౌరవిస్తారు. అలానే ఆమెకి బహుమతులు ఇస్తూ సర్ప్రైజ్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మనకి తెలిసిన విషయాలే. అయితే ఎన్టీఆర్ తన భార్యని ఏమని పిలుస్తారు..? మీకు తెలుసా..?

jr-ntr Marraige

యంగ్ టైగర్ ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి ఇండస్ట్రీలో క్యూట్ కపుల్స్ గా పేరు తెచ్చుకున్నారు. ఒకరి మీద ఒకరు చూపించే ప్రేమకి తారక్ ఫాన్స్ అలానే నెటిజెన్స్ ఎంతగానో సంతోషిస్తూ ఉంటారు. ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతిల వివాహం 2011 లో జరిగింది. అంగరంగ వైభవంగా వీళ్ళ పెళ్లి జరిగింది.

ఇండస్ట్రీలో వైభవంగా జరిగిన పెళ్లి వేడుకల్లో వీళ్లది కూడా ఒకటి అని చెప్పొచ్చు. వీళ్ళకి అభయ్ రామ్ భార్గవ్ రామ్ అని ఇద్దరు కొడుకులు ఉన్నారు. లక్ష్మీ ప్రణతికి ఎన్టీఆర్ అప్పుడప్పుడు బహుమతులు కూడా ఇస్తూ ఉంటారు ఆమె పుట్టిన రోజు నాడు సాలిడ్ గా అప్డేట్స్ బిగ్ గిఫ్ట్స్ ఇస్తూ షాక్ అయ్యేలా చేస్తారు. మరో ఇంట్రెస్టింగ్ విషయాన్ని ఇప్పుడు ఒకటి రివిల్ చేశారు.

ఇటీవల మార్చి 26న లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు అయింది. ఎన్టీఆర్ తన భార్యని విష్ చేశారు అలానే ముద్దుగా ఆమెని ఏమని పిలుస్తారో కూడా చెప్పారు. ప్రణతి ఎన్టీఆర్ క్యూట్ గా అమ్ములు అని పిలుచుకుంటారట. ఆమె ముద్దు పేరు అదేనట. ఇంట్లో అందరూ అలానే పిలుస్తూ ఉంటారట. తారక్ కి ఏమాత్రం సమయం దొరికినా ఫ్యామిలీతో సమయాన్ని గడుపుతూ ఉంటారు ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర మూవీ చేస్తున్నారు నటిస్తూ బిజీగా ఉంటున్నారు. వీలైనప్పుడల్లా కుటుంబంతో వెకేషన్ కి వెళ్తుంటారు దేవర సినిమా ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 10న గ్రాండ్గా రిలీజ్ కాబోతోంది.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading