సోషల్ మీడియా అనేది కొన్ని మంచి పనులకు ఉపయోగపడుతుంది. మరికొన్ని చెడు పనులకు అనగా మోసాలకు కూడా మంచిగానే ఉపయోగపడుతుంది. ఎవరూ ఏ విధంగా వాడుకుంటే వారికి ఆ విధంగా ఉపయోగపడుతుంది సోషల్ మీడియా. గుర్తు తెలియని వారు కూడా కొందరికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడుతుంటారు. అందులో ముఖ్యంగా ఇక అమ్మాయిలు అయితే ప్రత్యేకంగా చెప్పక్కరనేలేదు. అమ్మాయి నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తే మాత్రం చాలా మంది బాయ్స్ ఆలోచించకుండా టక్కున ఫ్రెండ్‌గా చేర్చుతారు. అక్కడే మోసపోతున్నారు. కొన్ని ఘటనలు కన్నీటిని, కష్టాలనే మిగుల్చుతున్నాయి.
Advertisement
ఇటీవల బీహార్‌లో జరిగిన ఓ ఘటన సంచలనమే సృష్టించింది. బీహార్ రాష్ట్ర భగల్ పూర్ ఖగారియఆలోని మార్టార్ గ్రామానికి చెందిన ఓ యువకుడు నిత్యం ఆన్‌లైన్‌లోనే గడిపేవాడు. ఈ తరుణంలో అతనికి ఆరు నెలల క్రితం ఫేస్‌బుక్‌లో ఓ యువతి నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. దీంతో క్షణం ఆలస్యం చేయకుండా వెంటనే యాక్సెప్ట్ చేసాడు. ఆ తరువాత అతనికి హాయ్ అని మెసేజ్ పంపింది. దీంతో మొదలైన వారి చాటింగ్ కాలక్రమేణా ఫోన్‌లు మాట్లాడుకునే వరకు వెళ్లింది. ఎంతో ప్రేమగా మాట్లాడుతుండడంతో యువకుడు ఆమె చెప్పినట్టు వినేవాడు. ఈ తరుణంలో ఓ రోజు దుస్తులు లేకుండా వీడియో కాల్ చేసింది. దీంతో ఆ యువకుడు కూడా దుస్తులు లేకుండా ఆమెతో ఫోన్‌లో మాట్లాడాడు. కొద్ది రోజులకు ఓ రోజు అతడికి ఓ మెసెజ్ వచ్చింది.
Advertisement
ఆ మెసేజ్‌లో నాకు రూ.50వేలు ఇవ్వాలని.. ఇవ్వకపోతే నీ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని సందేశం పంపించింది. దీంతో అది చూసిన ఆ యువకుడు షాక్‌కు కు గురయ్యాడు. దీంతో భయపడి వెంటనే ఆమెకు ఫోన్ పే ద్వారా రూ.7,100 పంపించాడు. ఆ తరువాత ఆమె మళ్లీ రూ.50,000 కావాలని డిమాండ్ చేసింది. రూ.21వేలు పంపుతాను అని చెప్పినా వినలేదు. అడిగినంత డబ్బు వెంటనే పంపించకపోతే వీడియోను అందరికీ షేర్ చేస్తానంటూ బెదిరించింది. దీంతో ఆ యువకుడు భయపడి ఫేస్‌బుక్ ఖాతాను కూడా తొలగించుకున్నాడు. ఆమె అతని ఫోన్ నెంబర్‌కు మెసేజ్ పంపుతూ బెదిరించింది. చివరికీ ఏమి చేయాలో అర్థంకాక ఆ యువకుడు పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.
Also Read : కోట్ల డీల్ కుదుర్చుకున్న సమంత.. అందుకే ఆ నిర్ణయం తీసుకుందా..?