Home » కోట్ల డీల్ కుదుర్చుకున్న స‌మంత‌.. అందుకే ఆ నిర్ణ‌యం తీసుకుందా..?

కోట్ల డీల్ కుదుర్చుకున్న స‌మంత‌.. అందుకే ఆ నిర్ణ‌యం తీసుకుందా..?

by Anji
Ad

టాలీవుడ్ బ్యూటీ స‌మంత గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. నాగ‌చైత‌న్య‌తో విడాకులు తీసుకున్న త‌రువాత త‌న కెరీర్ పైనే పూర్తిగా దృష్టి సారించింది. అయితే విడాకుల త‌రువాత స‌మంత చేసే ప్ర‌తి ఒక్క ప‌ని గురించి త‌న అభిమానుల‌తో పంచుకుంటూ ఉంటుంది. అదేవిధంగా స‌మంత విడాకులు తీసుకున్న త‌రువాత సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ నిత్యం ఓ ర‌క‌మైన పోస్టులు చేస్తూనే ఉంది.

Advertisement

స‌మంత షేర్ చేసిన పోస్టులు కొద్ది క్ష‌ణాల్లోనే సోష‌ల్ మీడియాలో వైర‌లవుతున్నాయి. స‌మంత కెరీర్ ప‌రంగా ఎంత బిజీగా ఉన్నప్ప‌టికీ స‌మ‌యం దొరికిన‌ప్పుడు అల్లా త‌న స్నేహితుల‌తో కలిసి టూర్స్ తిరుగుతూ ఎంజాయ్ చేస్తోంది. ఇదిలా ఉండ‌గా.. తాజాగా సోష‌ల్ మీడియాలో స‌మంత‌కు సంబంధించిన ఆస‌క్తిక‌ర వార్త చ‌క్క‌ర్లు కొడుతుంది. స‌మంత హైద‌రాబాద్ నుంచి మ‌కాం మార్చేసిందా..? కొత్త ఇంట్లోకి ఎంట్రి ఇవ్వ‌బోతుందా అనే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అస‌లు విష‌యం ఏమిటంటే..? స‌మంత ప్రైవ‌సీ ప్ర‌శాంత‌త కోసం ముంబైలో సీ ఫేసింగ్ ఇళ్లు కొనుగోలు చేసింద‌ని పెద్ద ఎత్తున వార్త‌లు వినిపించాయి.

Advertisement


స‌క‌ల సౌక‌ర్యాలు క‌లిగిన ఇంటి కోసం స‌మంత ఓ డీల్‌ను కుదుర్చుకుంద‌ట‌. ఆ కొత్త ఇంటి కోసం స‌మంత దాదాపుగా 5 కోట్లు వెచ్చించిన‌ట్టు స‌మాచారం. బాలీవుడ్‌లో మ‌రిన్ని సినిమాలు చేయాల‌న్న ఆలోచ‌న‌తో సొంత ఇంటిని కొనుగోలు చేసిన‌ట్టు తెలుస్తోంది. స‌మంత ప్ర‌స్తుతం చేతి నిండా ప్రాజెక్ట్‌ల‌తో బిజీగా ఉంది. ఈ త‌రుణంలో త‌ర‌చుగా స‌మంత ముంబై వెళ్లి వ‌స్తోంద‌ట‌. ఈ త‌రుణంలోనే యంగ్ హీరో అయిన వ‌రుణ్ ధావ‌న్‌తో పాటు బాలీవుడ్ హీరో అక్ష‌య్‌కుమార్ తో కూడా స‌మంత సినిమాలో న‌టించ‌డానికి సిద్ధం అయింద‌ట‌. స‌మంత ఇక‌పై బాలీవుడ్ సినిమాల్లో న‌టించ‌డానికి ఎక్కువ ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్న‌ట్టు స‌మాచారం. మొత్తానికి స‌మంత ఏమి నిర్ణ‌యం తీసుకుంటుంద‌నేది మాత్రం వేచి చూడాలి.

Visitors Are Also Reading