Home » పుట్టు వెంట్రుకులని ఎందుకు తీయిస్తారు..? దాని వెనుక ఇంత పెద్ద రీజన్ ఉందని తెలుసా..?

పుట్టు వెంట్రుకులని ఎందుకు తీయిస్తారు..? దాని వెనుక ఇంత పెద్ద రీజన్ ఉందని తెలుసా..?

by Sravya

బాబు లేదా పాప పుట్టిన ఏడాదిలోపు చాలా మంది పుట్టు వెంట్రుకలను తీస్తుంటారు. ఇంటి ఇలవేల్పు లేదంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి తీసుకువెళ్లి పుట్టు వెంట్రుకలు తీయించడం జరుగుతుంటుంది. ఇది ఒక వేడుకల చేస్తూ ఉంటారు. మొదటిసారి ఇంటి దేవుడికి తలనీలాలని సమర్పించడం చాలా మంది ఆచారంగా పాటిస్తున్నారు. పూర్వం కేవలం మగ పిల్లలు పుడితేనే ఈ సాంప్రదాయం ఉండేది. కానీ రాను రాను ఆడపిల్లలకి కూడా తలనీలాలని తీయించడం ఆచారంగా మారింది.

తల నీలాలని తీయించే విధానం ని పుట్టు వెంట్రుకలు తీయించడం అంటారు. తలనీలాలని తీసే సంప్రదాయంలో చాలా నియమాలని పాటిస్తూ ఉంటారు. కొంతమందికి ఏడాదిలోపు తీస్తే కొంత మంది కి మూడు లేదా ఐదు ఏళ్లలోపు తీయిస్తూ ఉంటారు. ఇలా ఎవరి పద్ధతిని బట్టి వాళ్ళు పాటిస్తూ ఉంటారు.

మేనమామ మొదట పుట్టు వెంట్రుకలను తీస్తారు. తల్లి ఒళ్లో బాబు కూర్చున్నాక మేన మామ జుట్టు ని కత్తరిస్తారు. ఆ తర్వాత మిగిలిన పుట్టు వెంట్రుకలని అక్కడ ఉండే వాళ్ళు తీస్తారు. పుట్టు వెంట్రుకలుకి పూర్వజన్మ కి సంబంధించిన లక్షణాలు ఉంటాయని.. అందుకే అవి ఉండకూడదని తొలగిస్తారు. పుట్టు వెంట్రుకలు తీస్తే మెదడు ఎదుగుదల బాగుంటుందని నరాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయని, బిడ్డ ఆరోగ్యంగా మారేందుకు అవుతుందని సైన్స్ అంటోంది.

Also read:

Visitors Are Also Reading