Home » అయ్య బాబోయ్… ఈ రోగం వస్తే ఆవులా మారిపోతారట !!

అయ్య బాబోయ్… ఈ రోగం వస్తే ఆవులా మారిపోతారట !!

by Bunty
Ad

మనుషులకు వచ్చే రోగాలు చిత్రవిచిత్రాలుగా ఉంటాయన్న విషయం తెలిసిందే. మనం ఎప్పుడు కనివినీ ఎరుగని రోగాలు కూడా అప్పుడప్పుడు ప్రపంచంలో ఎక్కడో ఒక మూల బయటపడుతూ ఉంటాయి. ఇది కూడా అలాంటిదే. ఈ వ్యాధి కనక వచ్చిందంటే మనుషులు ఆవుల్లా ప్రవర్తిస్తారట. అంతేకాదు గడ్డి మేయడం, గేదెలా బిహేవ్ చేయడం, పచ్చిక బయళ్ళలో తిరగడం వంటి వింత వింత ప్రవర్తన కనబరుస్తుంటారు అట. అంతే ఈ రోగం వచ్చింది అంటే మనుషులము అన్న సంగతి మర్చిపోయి జంతువులా బిహేవ్ చేస్తారట. మనుషుల్ని మనుషుల్లా తట్టుకోవడం కష్టం. మరి జంతువులు గా మారితే పరిస్థితి ఏమిటి?

Boanthropy is a rare psychological disorder that causes a human being to  believe they are a cow | Boing Boing

Advertisement

Advertisement

ఇది ఒక రకమైన వ్యాధి, దీని కేసులు చాలా అరుదుగా కనిపిస్తాయి. ఈ మానసిక రుగ్మత పేరు బోనాంత్రోపీ, ఇది ఒక రకమైన జెనాంత్రోపీ వ్యాధి. ఈ సమస్యతో ఎవరైనా బాధపడితే వారు ఆవులా ప్రవర్తిస్తున్నట్లు అతనికి అనిపించదని అంటున్నారు. ఈ వింత మానసిక రోగం మానసిక సమస్యలు, కలలు వంటి వాటి వల్ల వస్తుందని చాలా పరిశోధనల్లో తేలింది. అయినప్పటికీ చాలా మంది ప్రజలు ఈ వ్యాధికి కారణం బ్లాక్‌ మ్యాజిక్, చేతబడి అంటారు. కానీ అది నిజం కాదని వాదిస్తున్నారు వైద్యులు. నియో బాబిలోనియన్ రాజుగా ఉన్న రాజు నెబుచాడ్నెజార్ ఈ వ్యాధి బాధితుడని, ఆయన 605 BC నుండి 562 BC వరకు పాలించాడని ఓ నివేదిక ఇచ్చిన సమాచారం.

Visitors Are Also Reading