Home » Weekly Horoscope in Telugu 2024 : వార ఫలాలు.. ఆ రాశుల వారికి వ్యాపారంలో మంచి లాభాలుంటాయి

Weekly Horoscope in Telugu 2024 : వార ఫలాలు.. ఆ రాశుల వారికి వ్యాపారంలో మంచి లాభాలుంటాయి

by Anji
Ad

Weekly Rasi Phalau in Teluguమేష రాశి వారికి ఈ వారం శుభ గ్రహాల సంచారం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఏ పనైనా సానుకూలంగా జరిగిపోతుంది. వృషభ రాశి వారికి ఆర్థికంగా కొద్దిపాటి ఇబ్బందులున్నప్పటికీ తోబుట్టువులకు సహాయం చేస్తారు. మిథున రాశికి చెందిన నిరుద్యోగులకు కోరుకున్న కంపెనీల్లో ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది.

Weekly Horoscope in Telugu

Advertisement

Weekly Horoscope in Telugu 28.01.2023 నుంచి 03.02.2024 వరకు మేషం :

Mesha

Mesha

ఉద్యోగస్తులను శుభ ఫలిస్తున్నాయి. అధికార యోగం ఉంటుంది. ఆర్థిక పరిపుష్టి కలుగుతుంది. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. మిత్రుల సహకారంతో ఒక పని పూర్తి అవుతుంది. ఆత్మ సంతృప్తి చేసే పనులు అదృష్టాన్ని ఇస్తాయి. వ్యాపారంలో లాభాలుంటాయి. 

Weekly Horoscope in Telugu 2024: వృషభం 

Weekly Rasi Phalau in Telugu

Weekly Rasi Phalau in Telugu

అవసరాలను దృష్టిలో ఉంచుకొని పని చేయండి. గ్రహ బలం చాలా తక్కువగా ఉంది. ఏకాగ్రతతో పని చేయండి. కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఏదీ కూడా లోతుగా ఆలోచించకూడదు. ఎప్పటి పనులు అప్పుడే విజయవంతంగా పూర్తి చేయాలి. 

Weekly Horoscope in Telugu : మిథునం

Mithuna

Mithuna

కొన్ని విషయాల్లో అదృష్టం కలిసి వస్తుంది. ప్రారంభించిన పనుల్లో విజయం లభిస్తుంది. నిర్ణయాలు తీసుకునే ముందు లోతుగా ఆలోచించండి. ఆత్మీయుల సూచనలు చాలా అవసరం. లక్ష్యం సిద్ధించే వరకు కృషి ఆపొద్దు. దృఢ సంకల్పంతో ఇబ్బందులను అధిగమించాలి.

Weekly Horoscope in Telugu : కర్కాటకం

Karkataka

Karkataka

ఉత్సాహంగా పనులను ప్రారంభించండి. ఆశించిన ఫలితాలు త్వరగా వస్తాయి. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. పనుల్లో స్పష్టత వస్తుంది. సంభాషణలో సున్నితత్వము చాలా అవసరం. వ్యాపారంలో ప్రోత్సాహం లభిస్తుంది. ప్రతిభతో పనిచేస్తే విశేష ధన లాభాలు పొందవచ్చు.

Weekly Horoscope in Telugu : సింహం

Simha

Simha

పనుల్లో మీదైన ప్రతిభ చూపి అభివృద్ధిని సాధిస్తారు. కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. అధికారుల యొక్క అండదండలు ఉంటాయి. ఒక విషయంలో స్పష్టత వస్తుంది. భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది. సకాలంలో నిర్ణయాలు తీసుకొని అమలు చేయాలి.

Advertisement

Weekly Horoscope in Telugu కన్య

Kanya

Kanya

ధైర్యంగా సరైన నిర్ణయాలు తీసుకొని ఆచరించాలి. అభద్రత భావం తొలగుతుంది. తోటి వారి నుంచి తగిన ప్రోత్సాహం లభిస్తుంది. నిరంతర సాధన విశేషమైన జ్ఞానాన్ని ఇస్తుంది. ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉంటాయి.

Weekly Horoscope in Teluguతుల

Thula

Thula

మనోబలంతో నిర్మాణాత్మకమైన ఆలోచనలతో లక్ష్యాలను అందుకుంటారు. ఇంట్లో వారికి మీ వల్ల మేలు జరుగుతుంది. స్వల్ప ఆటంకాలు ఎదురవుతాయి. ఆత్మవిశ్వాసంతో మీ యొక్క బాధ్యతలను నిర్వర్తించండి. పరిస్థితుల్లోనైనా నిరాశకు గురికాకూడదు.

Weekly Horoscope in Telugu : వృశ్చికం 

VruChika

VruChika

మంచి ఫలితాలు ఉంటాయి. తోటి వారి సహాయ సహకారాలు అందుతాయి. ప్రయత్నం బలాన్ని బట్టి విజయాలు ఉంటాయి. వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి.

Weekly Horoscope in Telugu ధనుస్సు

Dhanassu

Dhanassu

గౌరవప్రదమైన జీవితము కొనసాగుతుంది. ప్రారంభించిన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. ఏకాగ్రతతో కృషిని కొనసాగించండి. అర్హతలను పెంచుకుంటూ నూతన విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేయాలి. మొహమాటంతో ఖర్చులు చేయకూడదు.

Weekly Horoscope in Teluguమకరం

Makara

Makara

కాలం వ్యతిరేకంగా ఉంటుంది కాబట్టి ముఖ్య కార్యక్రమాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఆత్మవిశ్వాసంతో కృషి చేయడం ఉత్తమం. అడుగడుగునా ఆటంకాలు ఉంటాయి. కొన్ని సంఘటనలు సహనాన్ని పరీక్షిస్తాయి. ప్రయత్న లోపం లేకుండా కష్టపడాలి.

Weekly Horoscope in Teluguకుంభం

Kumbham

Kumbham

పలుమార్గాల్లో ఆదాయం పొందే అవకాశం ఉంది. పనుల్లో స్పష్టత వస్తుంది. వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. బంధుమిత్రులతో ఆనందిస్తారు.

Weekly Rasi Phalau in Telugu : మీనం

Meena

ప్రయత్నాలు ఫలించి ఆశయాలు నెరవేరుతాయి. తోటి వారి సహాయ, సహకారాలు లభిస్తాయి. గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారంలో ఇబ్బందులు తలెత్తుతాయి. రుణ సమస్యలు ఎదురవకుండా జాగ్రత్త పడాలి. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు.

మరిన్ని తెలుగు వార్తల  కోసం ఇక్కడ మనం వీక్షిద్దాం.

Visitors Are Also Reading