Home » Weekly Horoscope in Telugu 2023 : వార ఫలాలు.. ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలంగా ఉంటుంది

Weekly Horoscope in Telugu 2023 : వార ఫలాలు.. ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలంగా ఉంటుంది

by Anji
Ad

Weekly Rasi Phalau in Teluguమేష రాశి వారికి ఈ వారం ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. వృషభ రాశి వారికి ఉద్యోగ జీవితంలో బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. మిథున రాశి వారి ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు.

Weekly Horoscope in Telugu

Advertisement

Weekly Horoscope in Telugu 21.12.2023 నుంచి 27.12.2024 వరకు మేషం :

Mesha

Mesha

వృత్తి, వ్యాపారాలు వేగం పుంజుకుంటాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. అనేక మార్గాలలో ఆదాయం పెరుగుతుంది. వృథా ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. కొందరు మిత్రులతో జాగ్రత్తగా ఉండాలి. కొద్దిగా డబ్బు నష్టపోయే సూచన లున్నాయి.కుటుంబ సభ్యులతో ఆనం దంగా కాలక్షేపం చేస్తారు.

Weekly Horoscope in Telugu 2024: వృషభం 

Weekly Rasi Phalau in Telugu

Weekly Rasi Phalau in Telugu

వృత్తి, వ్యాపారాలు ఒక మోస్తరుగా సాగుతాయి. కుటుంబపరంగా ఒక శుభకార్యం నిర్వహించడం జరుగుతుంది. కొద్దిగా మానసిక ఒత్తిడి ఉంటుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. చిన్ననాటి మిత్రుల నుంచి సహకారం లభిస్తుంది. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను నిదానంగా పూర్తి చేస్తారు.

Weekly Horoscope in Telugu : మిథునం

Mithuna

Mithuna

వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఉద్యోగాల్లో మంచి అవకాశాలు అందివస్తాయి. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి ఆశించిన స్థాయిలో ఉంటుంది. ఇతరులకు ఆర్థికంగా బాగా ఉపయోగ పడతారు. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.

Weekly Horoscope in Telugu : కర్కాటకం

Karkataka

Karkataka

వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. వ్యాపారంలో క్షణం కూడా తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమ, ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. ఆర్థిక సహాయం విషయంలో బంధుమిత్రుల నుంచి కొద్దిగా ఇబ్బందులుంటాయి.

Weekly Horoscope in Telugu : సింహం

Simha

Simha

వృత్తి, వ్యాపారాల్లో సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల లబ్ధి పొందుతారు. ఆర్థికంగా కొద్దిపాటి పురోగతి సాధిస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగు తాయి.

Weekly Horoscope in Telugu కన్య

Kanya

Kanya

వృత్తి, ఉద్యోగాలపరంగా అధిక ప్రయోజనాలను పొందు తారు. ఆర్థిక ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. సమాజంలో పలుకుబడి, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారాల్లో మీ ఆలోచనలు, ప్రయత్నాలు లాభాలను తెచ్చిపెడతాయి.

Advertisement

Weekly Horoscope in Teluguతుల

Thula

Thula

ఆర్థికంగా అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. బంధువుల నుంచి శుభ కార్యాలకు సంబంధించిన ఆహ్వానాలు అందుతాయి. తల పెట్టిన వ్యవహారాలు, పనులు, కార్యకలాపాలు సజావుగా సాగిపోతాయి. వృత్తి ఉద్యోగాలు కొత్త పుంతలు తొక్కుతాయి.

Weekly Horoscope in Telugu : వృశ్చికం 

VruChika

VruChika

ఆర్థిక లావాదేవీలు, ఆర్థిక ప్రయత్నాలు, అదనపు ఆదాయ ప్రయత్నాలు తప్పకుండా లాభిస్తాయి. వ్యక్తిగతంగా ఆశించిన పురోగతి ఉంటుంది. కుటుంబ జీవితంలో సుఖ సంతోషాలకు లోటుండదు. సమాజంలో మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. వృత్తి, ఉద్యో గాలలో ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు.

Weekly Horoscope in Telugu ధనుస్సు

Dhanassu

Dhanassu

ఎటువంటి ప్రయత్నమైనా సఫలం అయ్యే అవకాశం ఉంటుంది. తప్పకుండా ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ధనపరంగా అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక సమస్యలు తగ్గిపోతాయి.

Weekly Horoscope in Teluguమకరం

Makara

Makara

ఉద్యోగంలో బాధ్యతలు పెరిగినా ప్రోత్సాహకాలు, ప్రతిఫలాలు అందుతాయి. కొందరు బంధుమిత్రుల విషయంలో కొద్దిగా అప్రమత్తంగా ఉండడం మంచిది. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. ముఖ్యమైన పనులు, కార్యకలాపాలు నిదానంగా పూర్తవుతాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది.

Weekly Horoscope in Teluguకుంభం

Kumbham

Kumbham

వృత్తి, ఉద్యోగాల్లో పనిభారం పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. వ్యాపారాలలో క్షణం కూడా తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థిక లావాదేవీలు, ఇతర కార్యకలాపాలు ఊపందుకుంటాయి. ఇంటికి బంధువుల రాకపోకలుంటాయి.

Weekly Rasi Phalau in Telugu : మీనం

Meena

Meena

వృత్తి, వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహం లభిస్తుంది. ధన స్థానంలో సంచరిస్తున్న రాశ్యధిపతి గురువు కారణంగా ఆర్థిక వ్యవహారాలు బాగా అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక లావాదేవీల వల్ల ఆశించిన ప్రయోజనాలుం టాయి.

మరిన్ని తెలుగు వార్తల  కోసం ఇక్కడ మనం వీక్షిద్దాం.

Visitors Are Also Reading