నంద్యాల సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్స్ పై తెలుగుదేశం పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య తీవ్రస్థాయిలో విమర్శించారు.
ముఖ్యమంత్రిగా ఉండి బజారు భాష మాట్లాడతారా? అంటూ ప్రశ్నించారు. బూతుల మంత్రి కొడాలి నాని భాషని సీఎం మాట్లాడటం హేయం అని విమర్శించారు. సీఎం జగన్ భాష చూస్తే ఆయన మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లుగా ఉందన్నారు. సెల్ ఫోన్ తెలుగులో ప్రసవాలు చేస్తుంటే సిగ్గనిపించడం లేదా? అని మండిపడ్డారు.
Advertisement
Advertisement
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి నారా లోకేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అందరూ ఏకమైన తనను ఏమీ చేయలేరని, వెంట్రుక కూడా పీకలేరు అంటూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన లోకేష్ సోషల్ మీడియా వేదికగా జగన్ పై విరుచుకుపడ్డారు. ప్రస్టేషన్ కాకపోతే ఫన్ వస్తుందా? అంటూ లోకేష్ జగన్ తీరును ఎద్దేవా చేశారు. వెంట్రుక మహారాజ్ ఈకల ఎంపరర్ వైయస్ జగన్ గారు మీ వెంట్రుకలు పీకే ఓపిక, తీరిక లోకేష్ కామెంట్ చేశారు. మీ నవరంద్ర పాలన నుంచి ప్రజలను ఎలా గట్టెక్కించాలని ఆలోచనలతో మేము పని చేస్తున్నామని సెటైర్లు వేసారు లోకేష్.
Also Read : వాళ్లు నా వెంట్రుక కూడా పీకలేరు : ఏపీ సీఎం జగన్