Telugu News » Blog » వాళ్లు నా వెంట్రుక కూడా పీక‌లేరు : ఏపీ సీఎం జ‌గ‌న్

వాళ్లు నా వెంట్రుక కూడా పీక‌లేరు : ఏపీ సీఎం జ‌గ‌న్

by Anji
Ads

ప్రజలందరి దీవెనతో ముందుకు వెళ్తున్న తనను ఎవరు ఏం చేయలేరు అంటూ కామెంట్ చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. నంద్యాల ఎస్పీజీ గ్రౌండ్లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో జగన్ అన్న వసతి దీవెన నిధులు విడుదల చేశారు సీఎం జగన్. ప్రతి ఇంటి మేనమామ గా పిల్లలను చదివించే బాధ్యత తనదేనని మరోసారి తల్లిదండ్రులకు భరోసా ఇచ్చాడు. ఏపీ లో జరుగుతున్న అభివృద్ధి ప్రతిపక్షాలకు కనిపించడం లేదని మండిపడ్డారు. పిల్లలకు ఇచ్చే చిక్కీ పై సీఎం బొమ్మ ఉందంటూ చిల్లర రాజకీయాలతో రాద్ధాంతం చేస్తున్న ఘనత చంద్రబాబు, ఎల్లో మీడియా దేనని ఏద్దేవా చేశారు సీఎం జగన్. ఇవేవి నన్ను కదిలించలేవు, బెదిరించ లేవు, దేవుడి దయ, ప్రజల చల్లని దీవెనలతో ఈ స్థానానికి వచ్చాను. వాళ్లు వెంట్రుక కూడా పీకలేరని ధీమా వ్యక్తం చేశారు. ఇంకా మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.

అనేక విధాలుగా ఇక్కడ రచ్చ చేస్తున్న ఆ నేతలు.. ఢిల్లీలో ఏపీ పరువును దిగజార్చుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.10,68, 150 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి 1,024 కోట్ల రూపాయలు జమ చేశారు. తాము చేపట్టే పథకాలలో ప్రభుత్వ బడుల రూపురేఖలు మారాయని సీఎం జగన్ డ్రాపవుట్స్ సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. విద్యార్థులకు విద్యతో పాటు శారీరక ఎదుగుదల కోసం పథకాలు రూపొందించామన్నారు. అడ్మిషన్ల కోసం ప్రభుత్వ బడులు ఎమ్మెల్యేలు రికమండేషన్ చేసే స్థాయికి ఎదిగాయి అన్నారు.

నాడు_నేడు తో బడుల రూపురేఖలను మారుస్తూ సర్కారీ బడుగులకు మంచిరోజులు తీసుకొచ్చామని సీఎం జగన్ తెలిపారు. చేస్తున్న మంచేది ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు, ఎల్లో మీడియాకు పట్టట్లేదని, పార్లమెంట్ వేదికగా చేసుకొని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్న గొప్ప ఘనత వారిద‌ని పేర్కొన్నారు.


You may also like