కాలం మారింది సమాజం మారిపోయింది. డబ్బుతో పరిగెడుతూ మానవతా విలువలు మర్చిపోతున్నారు. అన్నిటికీ మూలం డబ్బే అంటూ దాని వెంటే పరిగెడుతూ అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. ఈ విధంగా కనీసం ఒక కుటుంబంలో పిల్లలు తల్లిదండ్రులు కూర్చొని మాట్లాడుకునే సమయం కూడా లేకపోవడంతో మానవతా విలువలు అనేవి తగ్గిపోతున్నాయి. తల్లిదండ్రులు డబ్బులు సంపాదించి పిల్లల్ని కార్పొరేట్ స్కూల్లో చదివిస్తూ, వారికి ఏది కావాలంటే అది ఇస్తూ మంచి ఏది చెడు ఏది అని తెలియకుండా పెంచేస్తున్నారు. చివరికి ఏదైనా తప్పు జరిగితే తలను పట్టుకుని బోరు మంటున్నారు.
Advertisement
పట్టుమని పదిహేనేళ్లు లేకపోయినా వారి మధ్య విపరీతమైన గొడవ వచ్చింది. జుట్లు జుట్లు పట్టుకొని నడిరోడ్డుపై కొట్టుకుంటూ వీరంగం సృష్టించారు స్కూల్ పిల్లలు. అందులో మళ్లీ ఆడపిల్లలు. పూర్తి వివరాల్లోకి వెళితే.. బెంగళూరు రాష్ట్రంలోని బిషప్ కాటన్ గర్ల్స్ స్కూల్ అమ్మాయిలు, మరో పాఠశాలకు చెందిన అమ్మాయిలు విచక్షణ మరచి దాడులు చేసుకున్నారు. ఇందులో బిషప్ కాటన్ పాఠశాల విద్యార్థినిలు యూనిఫామ్ ధరించి ఉండగా, మరో పాఠశాలకు చెందిన అమ్మాయిలు సివిల్ డ్రెస్ లోనే ఉన్నారు. మంగళవారం రోజున మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. బేస్బాల్ బ్యాట్ ఒకరికి ఒకరు మార్చుకుంటూ మరీ దాడులు చేసుకున్నారు.
Advertisement
Y'all need to even if y'all haven't already 😭😭😭 pic.twitter.com/fBbJv9CXoc
— T.sh (@Taha_shah0) May 17, 2022
వెంట్రుకలు పట్టుకుని కొట్టుకున్నారు. రోడ్డుపై పడేసి లాక్కెళ్లారు. ఈ ఘటనలో పలువురు అమ్మాయిలకు తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో అక్కడ అంతా భయానక పరిస్థితి ఏర్పడింది. ఆ గొడవను ఆపడం ఎవరి వల్ల కాలేదంటే వారు ఏవిధంగా కొట్టుకున్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ ఘటనపై ఇప్పటి వరకు పోలీసులు గాని, స్కూల్ మేనేజ్మెంట్ కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇందులో ప్రధానంగా అమ్మాయిలకు ఉన్నటువంటి ఒక బాయ్ ఫ్రెండ్ విషయంలో గొడవ వచ్చి ఇదంతా జరిగినట్టు సోషల్ మీడియా ద్వారా వచ్చిన స్క్రీన్ షాట్ ల ద్వారా తెలుస్తోందని స్థానికులు అంటున్నారు. మనం ఇప్పటివరకు కాలేజ్ అమ్మాయిలు కొట్టుకోవడం చూశాం. ఇతర గ్రూప్ గొడవలు చూసాం. కానీ స్కూల్ డ్రెస్ లో ఇలా విద్యార్థినిలు వీరంగం సృష్టించడం ఇదే మొదటిసారి కావచ్చు అని పలువురు మేధావులు మండిపడుతున్నారు.
also read;
సురేఖతో పెళ్లి వద్దని చెప్పిన చింరజీవి తండ్రి….కానీ చివరికి ఏం జరిగిదంటే..!
మహేశ్ బాబు ‘అతడు’ లో డిలీట్ చేసిన ఈ సీన్స్ చూస్తే వావ్ అనాల్సిందే..!