Home » పిల్లల అల్లరి బాగా ఎక్కువగా ఉంటోందా..? ఇలా చెయ్యాలైతే..!

పిల్లల అల్లరి బాగా ఎక్కువగా ఉంటోందా..? ఇలా చెయ్యాలైతే..!

by Sravya
Ad

చాలామంది పిల్లలు బాగా అల్లరి చేస్తూ ఉంటారు. చిన్న పిల్లల్ని తట్టుకోవడం కష్టమే. తల్లిదండ్రులకు ఇది పెద్ద సవాలుగా మారుతుంది. కొంతమంది పిల్లలు అయితే అస్సలు తల్లిదండ్రుల మాట వినరు. వద్దన్న పనులే చేస్తూ ఉంటారు. దేనినైనా గుద్దుకుని దెబ్బలు తగిలించుకుంటూ ఉంటారు అయితే పిల్లల్ని కంట్రోల్ లో ఉంచాలంటే వాళ్ళని కొట్టడం తిట్టడం ద్వారా కంట్రోల్ లో పెట్టచ్చని చాలామంది తల్లిదండ్రులు అనుకుంటూ ఉంటారు నిజానికి కొట్టడం తిట్టడం కంటే ప్రేమగా వాళ్లకి చెప్పడమే మంచిదని సైకాలజిస్ట్స్ చెబుతున్నారు. తల్లిదండ్రులు కనుక పిల్లల మీద అరిస్తే ఆ ఎఫెక్ట్ వాళ్ల మీద ఎక్కువ రోజులు పాటు ఉంటుందట.

Advertisement

Advertisement

దీంతో వాళ్ళు బాగా మొండిగా మారిపోతారు. అందుకని ఎప్పుడు కూడా వాళ్ళని మందలించకూడదు. ప్రేమగా చెబుతూ ఉండాలి. ఏదైనా చేయకూడదు అంటే ఎందుకు చేయకూడదు అనేది జాగ్రత్తగా వాళ్ళకి వివరించాలి. వాళ్ల మీద గట్టిగా అరవకండి ఓపికగా వాళ్ళు చెప్పేది వినాలి. ఒక్కొక్కసారి పిల్లలు చెప్పేది వినకపోతే వాళ్ళు వాళ్ళలో వాళ్ళ కుమిలిపోతూ ఉంటారు పైగా పెద్దయన తర్వాత పిల్లల్లో వాళ్ళ అనుభవాలు భయాలు వెంటాడుతూ ఉంటాయి. సమస్యలు వస్తాయి. వాళ్లు చెప్పేది ఓపికగా విని వాళ్ళు ఎందుకు ఆ పని చేశారనేది అడగాలి ఎక్కడికైనా తీసుకు వెళ్లేటప్పుడు కూడా ఎలా ఉండాలి అనేది ముందే తల్లిదండ్రులు చెప్పాలి.

Also read:

Visitors Are Also Reading