Home » 20 ఏళ్ల రికార్డును చెరిపేసిన వార్నర్.. 1043 రోజుల తరువాత సెంచరీ..!

20 ఏళ్ల రికార్డును చెరిపేసిన వార్నర్.. 1043 రోజుల తరువాత సెంచరీ..!

by Anji
Ad

ప్రపంచ క్రికెట్ లో సరికొత్త రికార్డులు నమోదు అవుతూనే ఉన్నాయి. ఫాంలో లేని ఆటగాల్లు ఫామ్ లోకి వస్తున్నారు. మంచి ఫామ్ లో ఉన్నటువంటి కీలక ఆటగాళ్లు ఫామ్ కోల్పోవడం వంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సెంచరీ సాధించాలని ఎంతగానో ఎదురు చూస్తున్న స్టార్ ప్లేయర్లు  తమ కోరికను తీర్చుకుంటున్నారు. అలాంటి వారిలో తొలుత భారత క్రికెటర్ కింగ్ కోహ్లీ ముందుంటే.. ఆ తరువాత ఆస్ట్రేలియా కీలక ఆటగాడు డేవిడ్ వార్నర్ నిలిచారు. ప్రస్తుతం ఇద్దరూ స్టార్ బ్యాట్స్ మెన్ లకు ఒకే సమస్య ఉంది. హాఫ్ సెంచరీలతోనే సరిపెట్టుకుంటున్నారు. ప్రస్తుతం సెంచరీ దాహం తీర్చుకుంటూ ముందుకు సాగుతున్నారు. 

Advertisement

కొద్ది నెలల కిందటే విరాట్ కోహ్లీ అంతర్జాతీయ సెంచరీ కోసం రెండున్నరేళ్ల తరువాత నిరీక్షణకు తెరపడింది. అదేవిధంగా ఇప్పుడు 2 ఏళ్ల 10 నెలల తరువాత అంటే మొత్తం 1043 రోజుల తరువాత డేవిడ్ వార్నర్ అంతర్జాతీయ సెంచరీ కోసం నిరీక్షణకు తెర పడింది. మెల్ బోర్న్ లో ఇంగ్లండ్ తో జరిగిన మూడో వన్డేలో డేవిడ్ వార్నర్ ఈ ఘనత సాధించాడు.  ఈ మ్యాచ్ లో డేవిడ్ వార్నర్ 102 బంతులు ఎదుర్కొని 106 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్ లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. ఎడమచేతి వాటం కలిగిన ఈ ఆస్ట్రేలియా ఓపెనర్ కి వన్డే కెరీర్ లో ఇది 18వ సెంచరీ. అంతర్జాతీయ కెరీర్ లో 43వ సెంచరీగా నిలిచింది. డేవిడ్ వార్నర్ తన 43వ అంతర్జాతీయ సెంచరీ కోసం చాలా కాలం వేచి ఉండాల్సి వచ్చింది. దాదాపు 1043 రోజుల తరువాత అతని బ్యాట్ నుంచి ఈ సెంచరీ సాధించాడు. తన చివరి సెంచరీని జనవరి 14, 2020న వాంఖడే మైదానంలో భారతజట్టుపై సాధించాడు. 

Advertisement

Also Read :  ఫిఫా ప్రపంచ కప్ లో అతి పెద్ద సంచలనం.. 36 విజయాల రికార్డుకి చెక్..!

Manam News

అప్పటి నుంచి ఇప్పటి వరకు వార్నర్ బ్యాట్ నుంచి సెంచరీ రాలేదు. తాజాగా మెల్ బోర్న్ లో సెంచరీ సాధించడమే కాదు.. తన ఓపెనింగ్ భాగస్వామి ట్రెవిడ్ హెడ్ తో కలిసి భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 20 ఏళ్ల రికార్డును చెరిపేశాడు. వార్నర్ తో పాటు మరో ఎండ్ లో ట్రావిస్ హెడ్ కూడా సెంచరీ సాధించాడు. వార్నర్ 106 పరుగులు చేస్తే.. హెడ్ 130 బంతుల్లో 152 పరుగులు చేయడం విశేషం. వార్నర్- హెడ్ మధ్య 269 పరుగుల భాగస్వామ్యం నెలకొంది. పురుషుల వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ లో ఇదే రికార్డు. ఇంతకు ముందు ఆస్ట్రేలియాకి చెందిన ఆడమ్ గిల్ క్ట్రిస్ట్, రికీ పాంటింగ్ పేరిట ఉంది. వీరు కూడా ఇంగ్లడ్ పై 2002లో 225 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. హెడ్-వార్నర్ కలిసి తాజాగా అతిపెద్ద భాగస్వామ్యంతో ప్రపంచ రికార్డు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

Also Read :  ఫిఫా ప్రపంచ కప్.. కోహ్లీతో సహా అందరి కళ్లు ఆ ఫోటో పైనే..!

Visitors Are Also Reading