ఆస్ట్రేలియా స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ అకస్మాత్తుగా మరణించడంతో యావత్ క్రికెట్ ప్రపంచం ఒక్కసారిగా షాక్‌కు గురైంది. థాయ్‌లాండ్ విహారంలో ఉన్న వార్న్ శుక్రవారం తన విల్లాలో గుండెపోటుతో మరణించారు. ఆయన మృతికి ముందు చివరి క్షణాల్లో ఏమి జరిగిందో వార్న్ మేనేజర్ జేమ్స్ ఎర్స్‌కిన్ బయటపెట్టాడు. ఇప్పుడు మరొక విషయాన్ని మేనేజర్ వెల్లడించారు. థాయ్‌లాండ్‌కు వెళ్లే ముందు 14 రోజుల పాటు కేవలం ద్రవ ఆహారం మాత్రమే తీసుకునే డైట్‌ను వార్న్ ప్రారంభించారని చెప్పారు.
Advertisement
Advertisement
ఒక రోజు చాతి వద్ద నొప్పిగా ఉందని, చెమటలు పడుతున్నాయని వార్న్ చెప్పారని మేనేజర్ ఎర్స్‌కిన్ వెల్లడించారు. సాధారనంగా వార్న్ ఎక్కువగా సిగరెట్లు తాగుతారని ఎర్స్‌కిన్ వివరించారు. అందుకే అది గుండె పోటు అయి ఉంటుందని వేరేది ఏమి కాదన్నారు. వార్న్ మరణంలో అనుమానస్పద సూచనలు ఏమి లేవు అని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని థాయ్‌లాండ్ పోలీసులు వెల్లడించారు. శవపరీక్షలో కూడా సహజ కారణాల వల్లే వార్న్ మృతి చెందినట్టు స్పష్టం అయిందని వెల్లడించారు. బరువు తగ్గేందుకు డైటింగ్ చేస్తున్నారని కొద్ది రోజుల ముందు వార్న్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.
Also Read : Video Viral : పుష్ప స్టైల్‌లో తగ్గేదేలే అంటున్న విరాట్ కోహ్లీ..!