Home » వారెవ్వా… ఏకంగా భార్య కోసం ఇంటినే తాజ్ మహల్ గా మార్చాడు… ఎక్కడంటే?

వారెవ్వా… ఏకంగా భార్య కోసం ఇంటినే తాజ్ మహల్ గా మార్చాడు… ఎక్కడంటే?

by aravind poju

ప్రేమ అనేది చాలా పవిత్రమైనది. అయితే ప్రస్తుతం ప్రేమకు అర్ధాలు మారిపోయినప్పటికీ సోషల్ మీడియా పుణ్యమా అని మనం ఎక్కడో ఒక చోట స్వచ్చమైన ప్రేమను మనం చూస్తూ ఉంటాం. ఇక అటువంటి విషయాలు తెలిసినప్పుడు ఎక్కడో ఓ మూల మనసు తేలిక అవుతుంది. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో బయటికి చెప్పినా చెప్పకపోయినా ఎవరో ఒకరిని ప్రేమిస్తారు. అయితే ప్రేమించనోళ్ళు దక్కకకపోయినా పెళ్లి చేసుకున్న భార్యను మనస్పూర్తిగా ప్రేమిస్తూ ఒకరికంటే ఒకరికీ ప్రాణంగా భావిస్తారు. అయితే ఆడ వాళ్ళతో పోలిస్తే మగ వాళ్ళ ప్రేమ ఎంతో నిజాయితీగా ఉంటుంది అంటారు.

                                                                             

కాని ఈ మాటను ఆడ వాళ్ళు ఒప్పుకోరు లేండి అది వేరే విషయం. అయితే ఉదాహరణకు తాజ్ మహల్ ను షాజహాన్ తన ప్రేయసి కోసం కట్టిందే కదా. అలా ప్రేమించిన వాళ్ళ కోసం మగ వాళ్ళు చేసిన త్యాగాలు ఎన్నెన్నో. అయితే అచ్చం ఇలాగే ఓ భర్త తన భార్య కోసం చేసిన ఓ పని నెట్టింట పెద్ద ఎత్తున వైరల్ గా మారింది. మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్‌కు చెందిన ఆనంద్‌ చోక్సీ అనే వ్యక్తి తన భార్యకు తాజ్ మహల్ లాంటి ఇల్లును బహుమతిగా ఇచ్చాడు. అయితే ఈ ఇల్లు కట్టడానికి ఏకంగా మూడేళ్లు పట్టిందట.

 

ఈ ఇల్లు అచ్చం తాజ్ మహల్ లాగా చీకట్లో కూడా వెలుగులు విరజిమ్మడం ఇక్కడ ఆసక్తికర విషయం. అయితే ప్రస్తుతం నెట్టింట్లో ఈ తాజ్ మహల్ లాంటి ఇల్లు పెద్ద ఎత్తున వైరల్ గా మారింది. నువ్వు ప్రస్తుత కలియుగపు  షాజహాన్
అంటూ నెటిజన్లు ఆకాశానికెత్తేస్తున్నారు.  భార్యకు ఇంతకు మించిన మంచి బహుమతి ఇవ్వలేరని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా తన భార్య కోసం ఇంతటి అత్యంత ఖరీదైన ఇల్లు అంతే కాక అచ్చం తాజ్ మహల్ లాగా నిర్మించి బహుమతిగా ఇవ్వడాన్ని తప్పకుండా మెచ్చుకొని తీరాల్సిందే కదా.


You may also like