Home » “వాల్తేరు వీరయ్య” సక్సెస్ మీట్ లో అపశృతి….!

“వాల్తేరు వీరయ్య” సక్సెస్ మీట్ లో అపశృతి….!

by AJAY
Ad

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమా ను సంక్రాంతి కానుకగా విడుదల చేశారు. ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహించగా శృతి హాసన్ చిరు కు జోడీగా హీరోయిన్ గా నటించింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా సూపర్ సూపర్ హిట్ గా నిలిచింది. ఇక సినిమా సూపర్ హిట్ అవ్వడం తో ఈ సినిమా సక్సెస్ మీట్ ను వరంగల్ లో ఏర్పాటు చేశారు.

Advertisement

Advertisement

కాగా వాల్తేరు వీరయ్య సక్సెస్ మీట్ లో అపశృతి చోటు చేసుకుంది. హన్మకొండలో జరిగిన వాల్తేరు వీరయ్య విజయోత్సవంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఊహించిన దానికన్నా ఎక్కువగా చిరంజీవి ఫ్యాన్స్ సక్సెస్ మీట్ కు తరలివచ్చారు. అలా ఒక్క సారిగా ఫ్యాన్స్ పెద్ద మొత్తంలో రావడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది.

హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజిలో ఈ వేడుక నిర్వహించగా సినీహీరోలను చూసేందుకు భారీగా ఫాన్స్,ప్రజలు తరలి వచ్చారు.
ఈ క్రమంలో పోలీసులకు, చిరంజీవి ఫాన్స్ కు మధ్య తోపులాట జరిగినట్టు తెలుస్తోంది. పోలీసులు గేట్లను ఒక్కసారిగా వదలడంతో తొక్కిసలాట జరగ్గా పలువురికి గాయాలయ్యాయి.

Visitors Are Also Reading