టాలీవుడ్ లోని సక్సెస్ దర్శకుల్లో వివి వినాయక్ కూడా ఒకరు. గత కొన్నేళ్లుగా వినాయక్ ఖాతాలో సరైన హిట్ పడి ఉండకపోవచ్చు కానీ ఆయన ఇప్పటి వరకూ ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించారు. టాలీవుడ్ లోని టాప్ దర్శకుల ప్రస్తుత లిస్ట్ తీస్తే అందులో ఆయన కూడా ఉంటారు. ఇదిలా ఉంటే వివి వినాయక్ కొన్ని ఇతర భాషల సినిమాలను రీమేక్ కూడా చేశారు.
Advertisement
అయితే రీమేక్స్ లో దర్శకులు కొన్నిసార్లు మార్పులు చేస్తే మరికొన్ని సార్లు ఉన్నది ఉన్నట్టుగా రీమేక్ చేస్తారు. అలా చేయడం వల్ల కొన్నిసార్లు ప్లస్ జరగొచ్చు….కొన్ని సార్లు మైనస్ కూడా జరగవచ్చు. అలా వివి వినాయక్ ఓ సినిమాలో మార్పు చేసి బ్లాక్ బస్టర్ కొడితే మరో సినిమాలో ఉన్నది ఉన్నట్టుగా దింపేసి ఫ్లాప్ అందుకున్నాడు.
Advertisement
ఆ సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం…..ప్రభాస్ హీరోగా వివి వినాయక్ దర్శకతంలో యోగి సినిమా వచ్చింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమాకు చాలా మంది అభిమానులు ఉన్నారు. కానీ కమర్షియగా చూసుకుంటే మాత్రం ఈ సినిమా సూపర్ హిట్ అవ్వలేకపోయింది. అయితే ఈ సినిమాను రీమేక్ చేసినప్పుడు ఒరిజినల్ వర్షన్ లో తల్లి చనిపోతుందట. ఆ సీన్ ను అలానే ఉంచడంతో సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చింది.
అంతే కాకుండా వివి వినాయక్ దర్శకత్వలో చిరంజీవి హీరోగా వచ్చిన సినిమా ఠాగూర్…ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేసింది. ఈ చిత్రానికి భారీ కలెక్షన్ లు వచ్చాయి. అయితే ఈ సినిమా ఒరిజినల్ లో హీరో క్లైమాక్స్ లో చనిపోతారట. కానీ తెలుగు ఠాగూర్ లో హీరో బ్రతికి ఉంటాడు. హీరో చనిపోకపోవడం వల్లే ఠాగూర్ బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ విషయాన్ని వివి వినాయక్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఇక వివి వినాయక్ మళ్లీ కం బ్యాక్ ఇవ్వాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.