మేషరాశిలో రాహువు, కుజుడు కలిసి ఉన్నారు. 11వ తేదీ వరకు ఉండి ఆ కుజుడు 11వ తేదీ తరువాత వృషభంలోకి వస్తున్నాడు. అదేవిధంగా మిథునంలో ఉన్న శుక్రుడు 7వ తేదీ నుంచి కర్కాటకంలో వస్తున్నాడు. అదేవిధంగా కర్కాటకంలో ఉన్న రవి 16వ తేదీ నుంచి సింహరాశిలోకి వస్తున్నాడు. సింహరాశిలో బుధ, చంద్రులు కలిసి ఉన్నారు. బుధుడు 21వ తేదీ వరకు సింహరాశిలో ఉండి తరువాత కన్యారాశిలోకి వెళ్తాడు. వృశ్చికంలో కేతువు, మకరంలో శని, మీన రాశిలో గురుడు ఉన్నారు. ఈ గ్రహ స్థితిని అనుసరించి ఆగస్టు నెల 2022లో వృషభ రాశి వారికి ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
ఈ నెలలో వృషభ రాశి వారికి ఎక్స్‌పెండిచర్ విషయంలో చక్కగా ఉంది. పార్ట్‌నర్ విషయంలో కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. జీవిత భాగస్వామి పేరు మీద ఆస్తులను కొనుక్కుంటారు. అదేవిధంగా ధన సంబంధిత విషయాల్లో 21 తారీకు తరువాత చక్కగా ఉంది. ఋణ సంబంధిత విషయాల్లో జాగ్రత్త వహించాలి. 7వ తేదీ నుంచి కొన్ని శుభవార్తలను వింటారు. సంతాన సంబంధిత విషయాల్లో చక్కగా ఉంది. సినిమా రంగంలో వారికి కొత్త అవకాశాలు రానున్నాయి. విద్యార్థులకు స్కాలర్ షిప్ కు సంబంధించిన విషయాల్లో అనుకూలంగా ఉంది. రైతులకు గవర్నమెంట్ ద్వారా కొన్ని సబ్సీడీలు వస్తాయి.
Advertisement
గృహ సబంధిత విషయాల్లో చక్కగా ఉంది. వాహనం కొనుగోలు చేసే అవకాశముంది. గ్రహబలం వల్ల కొన్ని పనులు జరుగుతాయి. రియల్ ఎస్టేట్స్ వారికి ధనయోగం కలుగనున్నది. పార్ట్‌నర్స్ తో కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇన్వెస్ట్‌మెంట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వృషభరాశి వారికి ఈ నెల అనుకూలంగా ఉండాలంటే చేయాల్సిన దేవతారాధన ఏమిటంటే.. విష్ణు సహస్రనామాలను నిత్యం పారాయణం చేయాలి. ఇక సూర్య భగవానుడిని చూసి విష్ణు సహస్ర నామాలను చేయడం మంచిది.
Also Read :
Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారికి ఓర్పు చాలా అవసరం