భారత్‌లో ఫ్లాగ్‌షిప్ మొబైళ్లను లాంచ్ చేసేందుకు వివో సిద్ధమైంది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు వివో ఎక్స్ 80 సిరీస్ విడుదలకానున్నది. ఈ సిరీస్‌లో Vivo X80, Vivo X80 Pro రానున్నాయి. ఫ్లాగ్‌షిప్ స్పెసిఫికేషన్లు, ZEISS కెమెరాలతో ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్లు వస్తున్నాయి. ఈ మధ్యకాలంలోనే చైనాలో విడుదల అయిన ఈ ఫోన్లు ఇప్పుడు భారత్‌కు వస్తున్నాయి. వీటికి సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
VIVO X80 PRO
Vivo X80 Pro Specifications/6.78 ఇంచుల Quad HD+ 2K AMOLED డిస్‌ప్లేతో Vivo X80 Pro వస్తోంది. 120 Hz స్క్రీన్ రిప్రెష్ రేట్ ఉంటుంది. పవర్‌పుల్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్ ఈ మొబైల్‌లో ఉంటుంది. గరిష్టంగా 12జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ రానున్నది. ముఖ్యమైన విషయం ఏమిటంటే వివో ఎక్స్ 80 ప్రో ఫోన్‌కు వెనుక వైపు నాలుగు కెమెరాలుంటాయి. Zeissతో కలిసి వివో ఈ లైన్స్ రూపొందించింది. 50 మెగా పిక్సెల్ Samsung GNV ప్రధాన కెమెరా, 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, 12 మెగాపిక్సెల్ 50 ఎం.ఎం.2X ఫోట్రయిట్ షూటర్, 8 మెగాపిక్సెల్ 5X టెలిఫోటో కెమెరా ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను వివో పొందుపరిచింది. వాటర్, డస్ట్ రెసిస్టెంట్ కోసం IP68 రేటింగ్‌తో వస్తుంది. 4700mAh బ్యాటరీ కలిగి ఉన్న ఈ ఫోన్ 80 వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ల వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్, 10 వాటర్ల వైర్‌లెస్ రివర్స్ చార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. Vivo X80 Pro ప్రారంభ ధర చైనాలో 5,499 యువాన్లు అంటే భారత్ కరెన్సీ ప్రకారం.. దాదాపు 63,300. భారత్‌లో కూడా 63,300 ఉండే అవకాశముంది.
Advertisement
VIVO X80
Vivo X80 Specifications/ మీడియాటెక్‌డైమన్సిటీ 9000 ప్రాసెసర్‌పై Vivo X80 రన్ అవుతుంది. 6.78 ఇంచుల FHD+ AMOLED డిస్‌ప్లేతో మార్కెట్‌లోకి రానుంది. ఇక ఈ మొబైల్ వెనుక మూడు కెమెరాలుంటాయి. 50 మెగాపిక్సెల్ Sony IMX866 RGBW ప్రధాన కెమెరా. 12 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ షూటర్, 12 మెగాపిక్సెల్ 50mm 2X ప్రోట్రయిట్ కెమెరా ఉన్నాయి. 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. Vivo X80 ఫోన్‌లో 4500mAh బ్యాటరీ ఉంటుంది. 80 వాట్ల చార్జింగ్‌కు సపోర్టు చేస్తుంది. Vivo X80 ప్రారంభ ధర చైనాలో 3,699 యువాన్లు.. అనగా భారత కరెన్సీ ప్రకారం.. 42,600 ఉంది. ఇక భారత్ లో కూడా 42,600 ధర పలికే అవకాశముంది. ఇవాళ విడుదల కాబట్టి.. ముందు ముందు ఆఫర్లను ప్రకటించే అవకాశం కూడా ఉంది. ఇంకెందుకు ఆలస్యం ఆసక్తి గల వారు ఈ ఫోన్‌ను కొనుగోలు చేసి ఎంజాయ్ చేయండి.
Also Read :
ఏటీఎం కార్డు లేకపోయినా డబ్బులు డ్రా చేయవచ్చు.. ఎలాగో తెలుసా..?
సాయంత్రం సమయంలో గోర్లు కత్తిరించకూడదు అంటారు ఎందుకో తెలుసా..?