టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే చాలామంది ప్రముఖులు మరణించారు. అయితే తాజాగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. కళకు ప్రాణం పోస్తూ, కలను బ్రతికించిన సినీ దర్శకులలో కళాతపస్వి కే.విశ్వనాథ్ ఒకరు. దాదాపు 50 కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించిన ఆయన ప్రతి సినిమాలోని కళకే ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు.
Advertisement
ఆయన దర్శకత్వం నుంచి జాలువారిన చిత్రాలన్నీ తెలుగు సినీ పుస్తకంలో ఆణిముత్యాల్లా మిగిలిపోయాయి. అలాంటి లెజెండ్ డైరెక్టర్ ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కే.విశ్వనాథ్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. 92 ఏళ్ల ఆయన వయోభారం తోనే కన్నుమూసినట్లు తెలుస్తోంది. తన తుది శ్వాస వరకు కలకోసమే బ్రతికిన ఆయన కన్నుమూసే చివరి క్షణంలో కూడా తన కుమారుడితో పాట రాయిస్తూ కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
Advertisement
కే.విశ్వనాథ్ మరణవార్తతో సినీ ఇండస్ట్రీ మూగబోయింది. లెజెండ్ డైరెక్టర్ ను కోల్పోయామంటూ దుఃఖంలో మునుగుతోంది. కేవలం తెలుగు, తమిళ్ సినిమాలకే కాకుండా బాలీవుడ్ లోనూ తొమ్మిది చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇక ఆయన దర్శకత్వంలో వచ్చిన శంకరాభరణం, సాగర సంగమం, స్వర్ణకమలం, శుభసంకల్పం వంటి ఎన్నో ఎవర్ గ్రీన్ క్లాసిక్ సినిమాలు తెలుగు సినీ పుస్తకంలో చెరిగిపోని ముద్రవేశాయి. ఇక కళాతపస్వి కే.విశ్వనాథ్ మృతి పట్ల పలుగురు సంతాపం తెలుపుతున్నారు.
READ ALSO : సమంతకు సెంటిమెంట్ కూడా ఉందా.. అందుకే ఆ రంగు రాళ్ళను దరిస్తుందా.. దీనికీ కారణం?