హీరో విశ్వక్ సేన్ మరియు టీవీ యాంకర్ నాగవల్లి మధ్య జరిగిన వాగ్వాదం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సినీ ప్రమోషన్స్ లో భాగంగా రోడ్డుపై ఫ్రాంక్ వీడియో చేసి అనేక విమర్శల పాలయ్యాడు. ఇదే అంశంపై ప్రముఖ టీవీ ఛానల్లో విశ్వక్సేన్ మరియు యాంకర్ నాగవల్లి మధ్య వాడి వేడి చర్చ సాగింది. దీంతో స్టూడియో నుంచి గెటవుట్ అంటూ యాంకర్ అనడం, విశ్వక్సేన్ దూషించడం నెట్టింట్లో వైరల్ గా మారింది. దీనిపై మాజీమంత్రి, ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. హీరో విశ్వక్సేన్ పై సంచలన షాకింగ్ కామెంట్స్ చేసారు.ఛానల్ వాళ్ళు విశ్వక్సేను హీరో గా గుర్తిస్తున్నారో లేదో తెలియదు కానీ మేం మాత్రం అతన్ని హీరోగా గుర్తించడం లేదంటూ కడిగిపారేశారు. డైరెక్ట్ గా లైవ్ లో ఇలాంటి అసభ్యకర పదాలు వాడటం కరెక్ట్ కాదని, దేవి నాగవల్లి కి యాంకర్ గానే కాకుండా బయట సమాజంలో మంచి గుర్తింపు ఉందని అలాంటి ఆమెను పట్టుకొని ఇలా మాట్లాడటం సహించరాని దంటు విశ్వక్సేన్ పై మండిపడ్డారు. ఆమె అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పే సత్తా ఉన్నప్పుడు మాత్రమే మీడియా ముందుకు రావాలని లేదంటే సైలెంట్ గానే ఉండాలని స్టూడియోలో విశ్వక్సేన్ మాట్లాడిన మాటల పై పోలీసులు కేసు నమోదు చేయాలని అన్నారు. ఆ హీరో బయట కనిపెడితే మహిళలు చెప్పులతో కొడతారని. అలాంటి వ్యక్తికి బుద్ధి చెప్పాలని అన్నారు. ఆయన్ని సినిమాల్లోకి రానియవద్దని దర్శక నిర్మాతలను కోరారు. మహిళా సంఘాలు ఆయనను కొట్టడానికి రెడీగా ఉన్నారని హీరో పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా రోడ్డుపై న్యూసెన్స్ క్రియేట్ చేసి ప్రమోషన్స్ చేసుకోవడం చట్టవిరుద్ధమని అన్నారు. అయితే హీరోపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి తలసాని చెప్పిన విషయం మనకు తెలిసిందే.
Advertisement
ALSO READ :
Advertisement
యాంకర్ దేవి నాగవల్లి ఆర్థిక కష్టాల గురించి మీకు తెలుసా..?
మహేష్ బాబు నోట సీఎం జగన్ ఫేవరెట్ డైలాగ్….దాని వెనక అసలు కారణం అదేనా…!