Home » మహేష్ బాబు నోట సీఎం జగన్ ఫేవరెట్ డైలాగ్….దాని వెనక అసలు కారణం అదేనా…!

మహేష్ బాబు నోట సీఎం జగన్ ఫేవరెట్ డైలాగ్….దాని వెనక అసలు కారణం అదేనా…!

by AJAY
Ad

మహేష్ బాబు హీరోగా పరశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా సర్కారు వారి పాట.ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకోగా మే 12న విడుదల తేదీని ఖరారు చేశారు. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడటంతో చిత్ర ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలోనే సినిమా ట్రైలర్ ను కూడా విడుదల చేశారు. ఇక ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

Advertisement

 

ట్రైలర్ విడుదలైన అతి తక్కువ సమయంలోనే మిలియన్స్ వ్యూవ్స్ తో యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. ఇదిలా ఉంటే ఈ ట్రైలర్ లో ఓ ఆసక్తికర సన్నివేశం ఉంది. సినిమా ట్రైలర్ లో మహేష్ బాబు ఏపీ సీఎం జగన్ ఎన్నికల సమయంలో చెప్పిన డైలాగ్….” నేను విన్నాను.. నేను ఉన్నాను” అంటూ చెప్పారు. సీఎం జగన్ చెప్పిన ఈ డైలాగ్ అప్పట్లో హైలెట్ గా నిలిచి ఎన్నికల్లో జగన్ విజయం దిశగా దూసుకు పోయేలా చేసింది.

Advertisement

అయితే ఇప్పుడు అలాంటి డైలాగ్ ను మహేష్ బాబు సినిమాలో పెట్టుకోవడం పై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. మహేష్ బాబు తండ్రి కృష్ణ.. సీఎం జగన్ తండ్రి దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి కి ఎంతో సన్నిహితంగా ఉండేవారన్న సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఉండేది. వైఎస్ఆర్ మరణం తర్వాత కూడా కృష్ణ జగన్ కి సపోర్ట్ చేశారు.

ఈ నేపథ్యంలోనే మహేష్ బాబు అభిమానం తో సినిమాలో జగన్ డైలాగ్ ను ఉపయోగించి ఉంటారని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అంతే కాకుండా మహేష్ బాబు నోట వైయస్ జగన్ డైలాగ్ రావడంపై వైసిపి కార్యకర్తలు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం ఈ డైలాగ్ ను సెటైరికల్ గా వాడారని కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా మహేష్ బాబు నోటి వెంట జగన్ డైలాగ్ రావడం ఇప్పుడు సినీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

Also read :

పెళ్లికి ముందు సహజీవనం చేస్తే వచ్చే సమస్యలు ఏంటి…? తప్పక తెలుసుకోండి…!

తెలుగులో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచిన.. స్టార్ హీరోల సినిమాలు.. ఏంటంటే..!!

Visitors Are Also Reading