Ad
భారత జట్టు కోసం ఆడేందుకు చాలా ఆటగాళ్లు రెడీగా ఉన్నారు. కానీ అసలైన కీలకమైన ఆటగాళ్లు ఎక్కువగా ప్రస్తుతం గాయాపడుతున్న విషయం తెలిసిందే. ప్రతి సిరీస్ కు కానీ.. ఏ టోర్నీలో కానీ భారత జట్టులో ఎవరో ఒక్క ఆటగాడు గాయపడుతూనే ఉన్నాడు. ఈ మధ్యే జరిగిన ఆసియా కప్ లో కూడా జడేజా గాయపడిన విషయం తెలిసిందే. ఇలా భారత ఆటగాళ్ల గాయాలపై సెహ్వాగ్ క్లారిటీ క్లారిటీ ఇచ్చాడు.
తాజాగా ఈ మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మాట్లాడుతూ.. ఆటగాళ్లు గ్రౌండ్ లో మ్యాచ్ ఆడుతూనో.. లేక ప్రాక్టీస్ చేస్తూనో గాయపడితే ఓకే. జడేజా ఆసియా కప్ లో ఎలా గాయపడ్డాడు అనేది నాకు ఇప్పటికి అర్ధం కావడం లేదు. కానీ మనం గమనించినట్లు అయితే ఈ మధ్య మన ఆటగాళ్లు ఎక్కువగా గ్రౌండ్ లో కాకుండా బయట చేస్తున్న పనులు అలాగే జిమ్ లలో గాయపడుతూ ఉన్నారు.
అయితే ఆటగలు ఫిట్ గా ఉండాలి. కానీ దానికంటే స్కిల్ అనేది ముఖ్యం. అయితే ఇప్పుడు ఆటగాళ్లు మాత్రం ఎక్కువగా తమ ఫిట్నెస్ పైన ఫోకస్ చేస్తున్నాడు. నేను ఆడే సమయంలో సచిన్ ఎప్పుడు వెట్ లిఫ్టింగ్ అనేది ఎక్కువగా చేసేవాడు కాదు. ఎందుకు అంటే.. నా శరిసం ఒత్తిడి పడితే నేను సరిగ్గా ఆడలేను. అలాగే నాకు రిథమ్ అనేది ఉండదు అని చెప్పాడు. కానీ ఇప్పుడు ఆటగాళ్లు అందరూ భారీ వేట్స్ అనేవి ఎత్తుతున్నారు. అదే వారు ఎక్కువగా గాయపడటానికి కారణం అవుతుంది అని సెహ్వాగ్ అన్నాడు.
ఇవి కూడా చదవండి :
పంత్ కు ఊర్వశి సారీ..!
ప్రపంచ కప్ జట్టులో షమీ లేకపోవడానికి కెప్టెన్ కారణమా..?
Advertisement