సినిమా : విరాట పర్వం
నటీనటులు : సాయి పల్లవి, రా నా, ప్రియమణి, నందితా దాస్, నవీన్ చంద్ర మరి కొందరు.
Advertisement
నిర్మాతలు : సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి.
దర్శకత్వం : వేణు ఉడుగుల
సంగీతం : సురేష్ బొబ్బిలి
వేణు ఉడుగుల దర్శకత్వంలో సాయి పల్లవి రానా జంటగా నటించిన విరాట పర్వం సినిమా గత ఏడాది విడుదల కావల్సి ఉంది. కానీ కరోనా కారణంగా ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఈ సినిమాను నక్సల్స్ ఉద్యమం లో జరిగిన నిజ సంఘటనలను ఆధారంగా తీసుకుని తెరకెక్కించారు. ఈ సినిమా టీజర్ మరియు ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ సినిమా ఆ అంచనాలను రీచ్ అయిందా లేదా అన్నది ఇప్పుడు చూద్దాం.
Virataparvam Movie Story కథ :
పోలీసులు మరియు నక్సల్స్ మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్న సమయం లో (సాయిపల్లవి) వెన్నెల జన్మిస్తుంది. సాయి పల్లవి పెరిగి పెద్దయిన తర్వాత ఉద్యమ నాయకుడు రవన్న (రానా) రాసిన కవితల పుస్తకాలను చదువుతూ పెరిగింది. రవన్న సాహిత్యంను ప్రేమించిన సాయి పల్లవి ఆ తర్వాత మెల్లమెల్లగా అతనితో ప్రేమలో పడుతుంది. వెన్నెల రవన్న ప్రేమ కోసం ఏం చేస్తుంది…? అడవిలోకి ఎలా వెళుతుంది..? ఉద్యమంలో ఉన్న రవన్న వెన్నెల తో ప్రేమలో పడ్డాడా…. దర్శకుడు వేణు ఊడుగుల విప్లవం కంటే ప్రేమ గొప్పది అని చూపించగలిగాడా… చివరికి వాళ్ల ప్రేమ కథ ఎలా ముగిసింది అన్నదే ఈ సినిమా కథ.
Advertisement
Virataparvam Movie Review and Rating విశ్లేషణ :
విరాటపర్వం సినిమాను నిజ సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు. కాబట్టి కమర్షియల్ హంగులు ఉంటే సినిమాకు మైనస్ అవుతుందని పలువురు అభిప్రాయపడ్డారు. కానీ వేణు అడుగుల కమర్షియల్ హంగులకు వెళ్లకుండా సినిమాను తెరకెక్కించారు. తను అనుకున్న కథను అనుకున్నట్టుగా చూపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. అమ్మాయి ప్రేమ విప్లవం కంటే ఎలా శక్తివంతమైనది అన్న దానిని చూపించాడు. సినిమా మొత్తం ప్రేమ ప్రేమ గొప్పతనాన్ని చూపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. మొదటి నుండి చివరి వరకు ప్రేమ కోసం సాయిపల్లవి పడే తపన సినిమాలో కనిపిస్తుంది.
తెరపై చాలా పాత్రలు ఉన్నా కళ్ళ ముందు మాత్రం వెన్నెల పాత్ర కదులుతూ ఉంటుంది. వెన్నెల పాత్రను వేణు మలచిన తీరు అద్భుతంగా ఉంటుంది. ఆ తర్వాత రవన్న పాత్ర కూడా అద్భుతంగా అనిపిస్తుంది. రానాకు ఇది మరో బెస్ట్ పర్ఫార్మెన్స్ సినిమా అవుతుంది. సాయి పల్లవి తన కళ్లతోనే భావాలను చక్కగా పలికించింది. ఈ సినిమా క్లైమాక్స్ లో సాయి పల్లవి అద్భుతంగా నటించింది. సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడా బోర్ కొట్టకుండా ఆద్యంతం సినిమాలో విలీనమై పోతారు. ప్రియమణి నందితాదాస్ తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. సినిమాకు సురేష్ బొబ్బిలి అందించిన స్వరాలు కూడా ప్లస్ అయ్యాయి. సినిమా కథ లో పాటలు భాగమైపోయాయి. నిర్మాణ విలులవలు…. ఎడిటింగ్… సినిమాటోగ్రఫీ కూడా కూడా బాగున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే విరాటపర్వం లాంటి సినిమాలు అరుదుగా వస్తుంటాయి. కచ్చితంగా సినిమాను థియేటర్ లో ఫ్యామిలీ తో కలిసి ఎంజాయ్ చేయొచ్చు.
Also Read:
నా భర్త ఆమెను ప్రేమించాడు..! ఆమె వద్దంటే నన్ను..! ఆ అమ్మాయికి వచ్చిన కష్టానికి సలహా ఇవ్వగలరా ?