Home » కోహ్లీ పేరిట ట్రిపుల్ సెంచరీ రికార్డ్…!

కోహ్లీ పేరిట ట్రిపుల్ సెంచరీ రికార్డ్…!

by Azhar
Ad
భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. సోషల్ మీడియాలో ట్రిపుల్ సెంచరీని కొట్టేసాడు విరాట్ కోహ్లీ. అయితే ప్రపంచంలోనే రెండో అతి పెద్ద ఆట అయిన క్రికెట్ లో విరాట్ కోహ్లీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. తన బ్యాటింగ్ లో అన్ని దేశాలలో ఫ్యాన్స్ ను సంపాదించుకున్న కోహ్లీ సోషల్ మీడియాలో ఎప్పుడు అభిమానులకు దగ్గరగానే ఉంటాడు. వారికీ కావాల్సిన ఫోటోలు, వీడియోలు అందులో పోస్ట్ చేస్తూనే ఉంటాడు. అందుకే కోహ్లీని చాల మంది ఫాలో అవుతుంటారు. అయితే తాజాగా ఈ సంఖ్య ట్రిపుల్ సెంచరీ దాటేసింది.
కోహ్లీ అభిమానులు ఎక్కువగా వాడే ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లల్లో అధికారిక ఖాతాలను కలిగి ఉన్నాడు. ఇక కోహ్లీని ట్విట్టర్ లో 48.5 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. అలాగే 49.3 మిలియన్ల మంది ఫ్యాన్స్ ఫేస్‌బుక్ లో ఫాలో అవుతున్నారు. ఇక అత్యధికంగా  ఇన్‌స్టాగ్రామ్‌ లో ఇప్పుడు కోహ్లీని ఫాలో అవుతున్న వారి సంఖ్య 202 మిలియన్స్ గా ఉంది. అయితే ఈ మూడు సోషల్ మీడియా ఖాతాలలో కలిపి మొత్తం కోహ్లీ ఫాలోవర్ల సంఖ్య 300 మిలియన్లను దాటేసింది. అందువల్ల సోషల్ మీడియాలో అత్యధికంగా ఫాలోయింగ్‌ను ఉన్న వారిలో ప్రపంచ వ్యాప్తంగా విరాట్ కోహ్లీ రెండో వ్యక్తి.
అయితే మన ఆసియాలో మాత్రం ఈ ఘనత అందుకున్న తొలి ప్లేయర్ కోహ్లీ అనే చెప్పాలి. క్రికెట్ చరిత్రలోనే ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న క్రికెటర్ మరొకరు లేరు. అయితే విరాట్ కోహ్లీ గత రెండేళ్లుగా సరైన ఫామ్ లో లేదు అనే విషయం అందరికి తెలిసిందే. ఇక ఈ ఐపీఎల్ 2022 సీజన్ లో కూడా దారుణంగా విఫలమయ్యాడు. అయిన కుడా తన ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం తగ్గలేదు. ఇక ప్రస్తుతం ఇంగ్లాండ్ లో ఉన్న విరాట్ కోహ్లీ వచ్చే నెలలో అక్కడి జట్టుతో జరగనున్న టెస్ట్ మ్యాచ్ కోసం సిద్ధమవుతున్నాడు. చూడాలి మరి ఇందులోనైనా కోహ్లీ రాణిస్తాడా లేదా అనేది.

Advertisement

Visitors Are Also Reading