ప్రపంచకప్ లో టీమిండియా అసాధారణ పర్ఫామెన్స్ తో అదరగొడుతుంది. ఆడిన నాలుగు మ్యాచ్లు గెలిచి ప్రత్యర్థి జట్లను బెంబేలెత్తిస్తోంది. నిన్న జరిగిన మ్యాచ్లో కోహ్లీ వీరోచిత పోరాటం పోరాటానికి బంగ్లాదేశ్ బలైపోయింది. 97 బంతులు ఆడిన కోహ్లీ 103 పరుగులు చేసి విజయ లాంచనాన్ని పూర్తిచేశాడు. దీంతో ఈ ప్రపంచకప్ లో టీమిండియా తరపున రెండు శతకాలు నమోదయ్యాయి. ఆఫ్ఘనిస్తాన్ పై 131 పరుగులతో సెంచరీతో బోని కొట్టగా…. బంగ్లాపై కోహ్లీ రెండో సెంచరీ కాయం చేశాడు.
అయితే ఈ సెంచరీ కూడా ప్రేక్షకుల్ని టెన్షన్ పెట్టింది. ఎందుకంటే టీమిండియా గెలవాలంటే రెండు పరుగులు చేస్తే సరిపోతుంది. ఆ సమయంలో కోహ్లీ సెంచరీ కొట్టాలంటే మూడు పరుగులు చేయాల్సి ఉంది. ఈ ఉత్కంఠ సమయంలో నసూమ్ వేసిన 42వ ఓవర్ లో విరాట్ కోహ్లీ సిక్స్ బాది సెంచరీతో పాటు టీమిండియా విజయ లాంఛనాన్ని పూర్తిచేశాడు. దీంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కైవసం చేసుకున్నాడు. అయినప్పటికీ జడేజాకు క్షమాపణలు చెప్పాడు కోహ్లీ.
Advertisement
Advertisement
ఎందుకంటే జట్టు 10 ఓవర్లు వేసి రెండు పరుగులు పడగొట్టి కేవలం 38 పరుగులు ఇచ్చాడు. కోహ్లీ సెంచరీ మిస్ అయి ఉంటే జడేజాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కేది. మ్యాచ్ అనంతరం కోహ్లీ మీడియాతో మాట్లాడుతూ జడ్డు నుంచి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లాక్కున్నందుకు క్షమించండి అంటూ నవ్వుతూ అన్నాడు. దీంతో టీమ్ ఇండియా ప్లేయర్స్ ఒక్కసారి నవ్వులతో హోరెత్తించారు.
ఇవి కూడా చదవండి
- Kohli : కోహ్లీ సెంచరీకి కారణం అంపైర్.. అతడికి కారు గిఫ్ట్ ఇవ్వాల్సిందే!
- Shubman Gill : గిల్ ను గోకుతున్న సచిన్ కూతురు..గ్రౌండ్ కు వచ్చి !
- Tiger Nageswara Rao review : “టైగర్ నాగేశ్వరరావు” రివ్యూ..మాస్ ఫ్యాన్స్ కు జాతరే