Home » Virat Kohli : టీ20 వరల్డ్‌ కప్‌ నుంచి కోహ్లీ ఔట్..అతనికి ఛాన్స్ ?

Virat Kohli : టీ20 వరల్డ్‌ కప్‌ నుంచి కోహ్లీ ఔట్..అతనికి ఛాన్స్ ?

by Bunty

టీమిండియా స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తన కెప్టెన్సీలో టీమిండియా కు ఎన్నో విజయాలు అందించాడు విరాట్ కోహ్లీ. ఇక కెప్టెన్సీకి రాజీనామా పెట్టిన తర్వాత… టీమిండియా కు ఎన్నో సేవలు చేస్తున్నాడు విరాట్ కోహ్లీ.

Virat Kohli no longer first choice for T20 World Cup 2024

అయితే అలాంటి విరాట్ కోహ్లీకి ఊహించని షాక్ తగిలింది. 2024 t20 వరల్డ్ కప్ వచ్చే వర్షాకాలం ముందు జరగనుంది. అయితే ఈ టోర్నమెంట్కు విరాట్ కోహ్లీ దూరం కానున్నట్లు సమాచారం అందుతోంది. ఈ మేరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి అధికారులు నిర్ణయం తీసుకున్నారట. యంగ్ ప్లేయర్స్ కు అవకాశం ఇచ్చేందుకు బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతుంది.

AB De Villiers Makes Big Statement On Virat Kohli’s Retirement

AB De Villiers Makes Big Statement On Virat Kohli’s Retirement

అయితే ఇందులో భాగంగానే త్వరలోనే విరాట్ కోహ్లీతో భారత క్రికెట్ నియంత్రణ మండలి అధికారులు చర్చించనున్నారట. మూడవ నెంబర్లో చాలా దూకుడుగా ఆడే ప్లేయర్ కావాలని…. అందుకే ఈశాన్ కిషన్ ను విరాట్ కోహ్లీ స్థానంలో తీసుకునేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతుంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుందట.

మరిన్ని  క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి !  తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.

Visitors Are Also Reading