ఐపీఎల్ 2023 చాలా రసవత్తరంగా కొనసాగుతోంది. ఇక నిన్న జరిగిన ఉత్కంఠ పోరులో ఆర్సీబీ చేతిలో లక్నో సూపర్ జేయింట్స్ చెత్తగా ఆడి చిత్తుగా ఓడింది. బెంగుళూరు స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకొని తమ సొంత గడ్డపై ఎదురైన పరాజయానికి లక్నో గడ్డపై ప్రతీకారం తీర్చుకుంది. సోమవారం జరిగిన ఐపిఎల్ మ్యాచ్ లో 18 పరుగులతో బెంగుళూరు గెలుపొందింది.
READ ALSO : Chikoti Praveen: థాయ్‌లాండ్ పోలీసులకు చిక్కిన చికోటి ప్రవీణ్.. ఇతని బ్యాక్ గ్రౌండ్ ఏంటి ?
Advertisement
తోలుత బెంగళూరు 20 ఓవర్లలో 9 వికెట్లకు 126 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ డుప్లేసిస్ రాణించాడు. తర్వాత లక్నో 19.5 ఓవర్లలో 108 పరుగులకే ఆల్ అవుట్ అయింది. లక్నో కళ్ళ ముందున్న లక్ష్యం చిన్నది. కానీ బ్యాటర్ల నిర్లక్ష్యం జట్టును పవర్ ప్లే లోనే ఫ్లాప్ చేసింది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా కోహ్లీ, గంభీర్ మరోసారి గొడవకు దిగారు. మ్యాచ్ అనంతరం ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలాయి. ఇద్దరి మధ్య మాట పెరిగి గొడవకు దారి తీయడంతో సహచర ఆటగాళ్లు జోక్యం చేసుకొని విడదీశారు.
Advertisement
read also : Mahesh Babu : దుబాయ్ లో కోట్లు పెట్టి… విల్లా కొన్న మహేష్ బాబు!
అమిత్ మిశ్రా కోహ్లీని అడ్డుకోగా, కేఎల్ రాహుల్ గంభీర్ ను పక్కకు తీసుకెళ్లాడు. వీరి గొడవకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే కోహ్లీ, గంభీర్ మధ్య తీవ్ర స్థాయిలో గొడవ జరిగిన నేపథ్యంలో రిఫరీ సీరియస్ గా స్పందించారు. వారిద్దరి మ్యాచ్ ఫీజులో ఏకంగా 100% విధించారు. అలాగే గొడవకు కారణమైన లక్నో ఆటగాడు నవీన్ ఉల్ హక్ కు 50% ఫైన్ విధించారు. ఐపీఎల్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. కాగా, త్వరలో వీరితోరి స్వయంగా మాట్లాడనున్నట్లు సమాచారం.
Read also : ఆ ప్రైవేట్ ప్లేస్ లో టాటూ వేయించుకున్న సంయుక్త మీనన్…అతని పేరు వేయించుకుందా !