నిన్న జరిగిన మ్యాచ్ లో ధోని సేన మరో విజయం సాధించింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన ఉత్కంఠ పోరులో 8 పరుగుల తేడాతో ఆర్సిబి పరాజయం పాలైంది. చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఓడిపోయినప్పటికీ కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్ మాత్రం అభిమానుల మనసు గెలిచాడు. ఈ మ్యాచ్లో మొత్తంగా 33 బంతులు ఎదుర్కొన్న అతడు 5 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 62 పరుగులు సాధించాడు. తద్వారా ఐపిఎల్ 2023లో ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్లలో కలిపి 259 పరుగులు పూర్తి చేసుకుని అత్యధిక పరుగుల వీరుల జాబితాలో అగ్రస్థానానికి ఎగబాకాడు.
READ ALSO : Ileana :పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న ఇలియానా….
Advertisement
Advertisement
అయితే ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ కి ఊహించని షాక్ తగిలింది. ఈ రన్ మెషిన్ నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను ఐపీఎల్ నిర్వాహకులు జరిమానా విధించారు. మ్యాచ్ ఫీజులో 10% కోత విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఐపీఎల్ 2023లో చెన్నై సూపర్ కింగ్స్ తో బెంగళూరులోని ఏం.చిన్న స్వామి స్టేడియంలో మ్యాచ్ సమయంలో ఐపీఎల్ ప్రవర్తన నియమావళిని అతిక్రమించినందుకు రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఫైన్ విధిస్తున్నాం.
READ ALSO : ప్రత్యేకంగా అలాంటి దుస్తులు వేసుకోను… బేబీ బంప్ పై ఉపాసన !
మ్యాచ్ ఫీజులో 10% కోత పెడుతున్నాం. మిస్టర్ కోహ్లీ ఐపిఎల్ కోడ్ లోని ఆర్టికల్ 2.2 లోని లెవెల్ 1 నిబంధన ఉల్లంఘించారు అని బీసీసీఐ ప్రకటనలో పేర్కొంది. కాగా, కోహ్లీకి ఏ ఘటన కారణంగా జరిమానా విధించారన్న విషయం వెల్లడించినప్పటికీ సీఎస్కే బ్యాటర్ శివమ్ దుబే అవుట్ అయిన సమయంలో కోహ్లీ వ్యవహరించిన తీరే ఇందుకు కారణమని తెలుస్తోంది.
READ ALSO : తాళిబొట్టు తీసేసిన యాంకర్ శ్యామల..భర్తతో విభేదాలు పెరిగాయా?