టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అయితే ప్రస్తుతం టీమిండియాను వదిలేసి నేరుగా ముంబై వెళ్ళిపోయాడట విరాట్ కోహ్లీ. ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్ మూడు రోజుల్లో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 5వ తేదీ నుంచి నవంబర్ 19వ తారీఖు వరకు వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్ జరగనుంది.
దాదాపు పది సంవత్సరాల తర్వాత ఇండియాలో వన్డే వరల్డ్ కప్ జరుగుతోంది. ఇందులో భాగంగానే విదేశీ జట్లైన 9 టీమ్స్… ఇండియాకు చేరుకొని వామప్ మ్యాచ్లు వాడుతున్నాయి. ఇక టీమిండియా కూడా వరల్డ్ కప్ నకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే ఇండియా ఆడవలసిన తొలి వామప్ మ్యాచ్ రద్దు అయింది. దీంతో గువాహటీ నుంచి తిరువనంతపురం బయలుదేరింది టీమిండియా.
Advertisement
Advertisement
అయితే టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ తిరువనంతపురం వెళ్లకుండా నేరుగా ముంబై వెళ్లాడట. టీమిండియా పెద్దల అనుమతితో తన భార్యను కలిసేందుకు విరాట్ కోహ్లీ తిరువనంతపురం వెళ్లకుండా ముంబై ఫ్లైట్ ఎక్కినట్లు తెలుస్తోంది. దీంతో అనుష్క శర్మ మరియు విరాట్ కోహ్లీ మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నారని కోహ్లీ ఫ్యాన్స్ ప్రచారం చేస్తున్నారు. తాగా ఇప్పటికే విరాట్ కోహ్లీ మరియు అనుష్క శర్మకు వామిక అనే కూతురు ఉన్న సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి
- నాగచైతన్య-సమంత విడాకులు తీసుకోవడానికి నాగార్జున సలహానే కారణమా?
- రోజా ఉంటే సినిమా చెయ్యను : రామ్ చరణ్
- హెరిటేజ్ ఓనర్ కు వెన్నుపోటు పొడిచి.. ఆ కంపెనీని చంద్రబాబు సొంతం చేసుకున్నాడా ?