టీమిండియా కెప్టెన్లలో, గొప్ప నాయకులలో విరాట్ కోహ్లీ ఒకరు. అతను కెప్టెన్ గా ఒక్క ఐసీసీ టోర్ని గెలవకపోయినా… నాయకత్వంలో అతని దూకుడు అందర్నీ ఆకట్టుకుంది. ధోని తర్వాత కెప్టెన్సీ అందుకున్న కోహ్లీ టీమిండియాకు మరపురాని విజయాలను అందించాడు. ఇక కోహ్లీ తర్వాత కెప్టెన్ అయిన రోహిత్ శర్మ అంతగా విజయాలను రాణించలేదు. ద్వైపాక్షిక సిరీస్ లో పర్వాలేదనిపించినా….మెగా టోర్నీలో తేలిపోతున్నారు.
Advertisement
ఇక డబ్ల్యూటీసి ఫైనల్ లో టీమిండియా ఘోరంగా ఓడిపోయింది. దాంతో టెస్ట్ కెప్టెన్సీ మళ్లీ కోహ్లీకి తిరిగి ఇవ్వాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ ఆటగాడు ఆకాష్ చోప్రా కీలక వాక్యాలు చేశారు. వచ్చే డబ్ల్యూటీసి ఫైనల్స్ కు కోహ్లీని మాజీ సారథిగా చేయడం కరెక్ట్ కాదని తెలిపారు. కోహ్లీకి మళ్ళీ టెస్ట్ కెప్టెన్సీ ఇచ్చే అవకాశం ఉన్న కానీ అలా జరగదని అభిప్రాయపడ్డాడు. కోహ్లీని కెప్టెన్సీ నుంచి ఎవరు తప్పించలేదు. తనకు తాను సారధిగా బాధ్యతలు వదులుకున్నాడు. కాబట్టి మళ్ళీ కోహ్లీని మళ్లీ కెప్టెన్సీ బాధితుల నుంచి దూరంగా ఉంచడమే మంచిది అని ఆకాష్ చోప్రా చెప్పారు. మూడు ఫార్మాట్స్ కు కెప్టెన్ గా ఉన్న కోహ్లీ టీ 20 నుండి సారధి బాధ్యతలను వదులుతున్నాడు.
Advertisement
ఈ సమయంలో బీసీసీఐ అతన్ని వన్డే కెప్టెన్ గా తొలగించింది. దాంతో 2022లో టెస్ట్ కెప్టెన్సీ నుంచి కోహ్లీ తప్పుకున్నాడు. అది చూసి బీసీసీఐ కూడా షాక్ అయింది. ఇక అప్పటి నుండి రోహిత్ శర్మ కెప్టెన్సీ బాధ్యతలను చేస్తున్నాడు. ఇక 68 టెస్టులకు కెప్టెన్సీగా వ్యవహరించిన కోహ్లీ 40 మ్యాచులను గెలిపించాడు. టీమిండియాకు సక్సెస్ఫుల్ కెప్టెన్ గా నిలిచారు. ఇక ఇప్పుడు మెగాటోర్నీలా ఓటమి సమయంలో రోహిత్ ను తొలగించాలని డిమాండ్స్ పెరుగుతున్నాయి. ఈ క్రమంలో టెస్టుల్లో కోహ్లీని, వన్డేల్లో హార్దిక్ పాండ్యాను కెప్టెన్ గా చేయాలని డిమాండ్స్ పెరుగుతున్నాయి. మరి దీనిపై కోహ్లీ బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.